కొత్త మద్యం షాపులు వారికే, మార్గదర్శకాలు - ఫీజు ఖరారు..!!

ఏపీలో కొత్త మద్యం షాపుల నోటిఫికేషన్ కు రంగం సిద్దమైంది. ఎక్సైజ్ శాఖ తుది కసరత్తు చేస్తోంది. రిజర్వేషన్ల కోటాలోని షాపులను ఎక్కడెక్కడ కేటాయించాలన్న అంశంపై అబ్కారీ శాఖ కసరత్తు చేస్తోంది. కల్లుగీత వృత్తి కులాల జనాభా ఏయే జిల్లాల్లో ఏ మేరకు ఉన్నారనే అంశంపై ఆరా తీస్తున్నారు. లైసెన్సు ఫీజు పైన ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారు.

నోటిఫికేషన్
ఏపీలో కొత్త మద్యం షాపుల నోటిఫికేషన్‌ విడుదలకు ఎక్సైజ్‌శాఖ సిద్ధమవుతోంది. రాష్ట్రంలో మొత్తం 3,736 మద్యం షాపులకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది. ఇందులో 340 షాపులు కల్లుగీత వృత్తి దారులకు కేటాయించనున్నారు. రిజర్వేషన్ల కోటాలోని షాపులను ఎక్కడెక్కడ కేటాయించాలన్న అంశంపై అబ్కారీ శాఖ కసరత్తు చేస్తోంది. కల్లుగీత వృత్తి కులాల జనాభా ప్రాతిపదికనే మద్యం షాపులను ఎక్సైజ్‌ శాఖ రిజర్వు చేయనుంది. నూతన మద్యం పాలసీలో భాగంగా మద్యం అమ్మకాల కోసం ప్రైవేట్ రిటైల్ విధానాన్ని అనుసరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

All set for Release of notification for wine shops details here

రెండేళ్ల పరిమితి
ఈ నూతన విదానం రెండేళ్ల కాలపరిమితి ఉండేలా నిర్ణయించారు. దీని ద్వారా రిటైలర్ల ఎక్కువ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. తక్కువ ధరకే నాణ్యమైన పలు రకాల మధ్యాలను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం అధికారులకు స్పష్టం చేసింది. ఇతర రాష్ట్రాల్లో చీప్ లిక్కర్ ధరలను పరిశీలించిన ప్రభుత్వం..ఏపీలో క్వార్టర్‌ రూ.99గా ఉండాలని నిర్ణయించింది. గత ప్రభుత్వంలో కొత్తగా పుట్టుకొచ్చిన బ్రాండ్లను తొలగించి, వాటి స్థానంలో గతంలో ఉన్న పాపులర్‌ బ్రాండ్లను ప్రవేశపెట్టనుంది. సాధారణ లిక్కర్‌ షాపులతో పాటు కేవలం ప్రీమియం రకం మద్యం బ్రాండ్లు దొరికే ఎలైట్‌ షాపులకూ గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వనుంది.

ఫీజులపై నిర్ణయం
రాష్ట్ర వ్యాప్తంగా 12 ఎలైట్‌ షాపుల ప్రారంభానికి అనుమతివ్వనుంది. లైసెన్సీలు వారి షాపుల పక్కన వాక్‌ ఇన్‌ స్టోర్‌లు ఏర్పాటు చేసుకోవచ్చు. దీనికోసం లైసెన్సీలు అదనంగా రూ.5 లక్షలు ప్రభుత్వానికి చెల్లించాలి. డ్రాట్‌ బీరు తయారు చేసి, విక్రయించే మైక్రో బ్రూవరీలకు మళ్లీ అనుమతివ్వనున్నారు. మైక్రో బ్రూవరీల్లో అప్పటికప్పుడు బీరును తయారుచేసి విక్రయిస్తారు. మైక్రో బ్రూవరీ ఏర్పాటు చేసుకునే వారు బార్‌తో సమానంగా లైసెన్సు ఫీజు చెల్లించేలా నోటిఫికేషన్ జారీకి తుది కసరత్తు జరుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+