పేరెంట్స్ కు ఏపీ ప్రభుత్వం కీలక సందేశం...!!
ఏపీ ప్రభుత్వం విద్యా సంస్కరణల దిశగా అడుగులు వేస్తోంది. ప్రభుత్వం తమ నిర్ణయాల్లో పేరెంట్స్ ను భాగస్వాములను చేస్తోంది. ప్రభుత్వ ఆలోచనలను పేరెంట్స్ తో పంచుకుంటూ.. వారి సూచనలతో ముందుకు వెళ్లాలని భావిస్తోంది. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 7న మెగా పేరెంట్ - టీచర్ సమావేశానికి నిర్ణయించారు. రాష్ట్రంలోని మొత్తం 45,094 పాఠశాలల్లో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు.
ఏపీ ప్రభుత్వం ఈ మెగా పేరెంట్ - టీచర్ సమావేశాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వం .. ఏయిడెడ్ పాఠశాలల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. సీఎం చంద్రబాబు బాపట్లలో.. డిప్యూటీ సీఎం పవన్ కడపలో జరిగే సమావేశంలో పాల్గొంటారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపర్చాలనే లక్ష్యంతో పేరెంట్స్ ను భాగస్వాములను చేస్తూ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు, విద్యా ప్రమాణాలను పెద్ద ఎత్తున మెరుగు పర్చాలనే లక్ష్యంతో ఈ సమావేశం ఏర్పాటు చేసారు.













Click it and Unblock the Notifications