తిరుమలలో భక్తుల చింత ఇక తీరినట్టే..
Heavy rain in Tirumala: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడన ప్రభావం వల్ల ఏపీలో భారీ వర్షాలు పడుతున్నాయి. శ్రీకాకుళం నుంచి చిత్తూరు జిల్లా వరకు దంచికొడుతున్నాయి. వచ్చే అయిదు రోజులపాటు రాష్ట్రంలో విస్తృతంగా పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్ర అల్పపీడనం.. పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ నేడు వాయుగుండంగా, రేపటికి తీవ్ర వాయుగుండంగా బలపడనుంది. అనంతరం తుపానుగా మారే అవకాశం ఉంది.
ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తిరుమల తిరుపతి దేవస్థానం ముందస్తు ఏర్పాట్లు చేపట్టింది. భారీ వర్షాల నేపథ్యంలో ఇఖ్కడ తలెత్తిన పరిస్థితులపై టీటీడీ అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తోన్నారు. భారీ వర్షాలకు కొండ చరియలు, చెట్లు విరిగిపడితే ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఎప్పటికప్పుడు జేసీబీల ద్వారా తొలగించాలని టీటీడీ అటవీ, రవాణ విభాగం చర్యలు తీసుకుంటోంది. విద్యుత్, ఐటీ విభాగాలు సమన్వయంతో భక్తులకు నిర్దేశించిన ఆన్ లైన్ సేవలో ఎక్కడ ఇబ్బంది కలగకుండా చూడాలని పేర్కొన్నారు.

ఈ భారీ వర్షాలు భక్తుల చింత తీర్చాయి. తిరుమలలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో అయిదుప్రధాన జలాశయాలు పూర్తిస్థాయి నీటి మట్టాన్ని అందుకున్నాయి. జలకళను సంతరించుకున్నాయి. తిరుమలకు పాపవినాశనం, ఆకాశగంగ, గోగర్భం, కుమారధార, పసుపుధార జలాశయాలు ప్రధాన నీటి వనరులు. భారీ వర్షాల వల్ల వరదనీరు జలాశయాల్లోకి చేరుకుంటోంది. ప్రస్తుత నీటి నిల్వలు తిరుమలకు 215 రోజుల మంచినీటి అవసరాలకు సరిపోతాయి.
గోగర్భం డ్యామ్ పూర్తిగా నిండిపోవడంతో ఒక గేటును తెరిచి నీటిని దిగువకు విడుదల చేస్తోన్నారు టీటీడీ అధికారులు. శుక్రవారం ఉదయం 8 గంటల సమయానికి ఆయా రిజర్వాయర్ల నీటిమట్టం వివరాలు ఇలా ఉన్నాయి.
1. పాపవినాశనం- 696.05 మీటర్లు
గరిష్ట నీటిమట్టం- 697.14 మీటర్లు
నిల్వ సామర్థ్యం: 5240.00 లక్షల గ్యాలన్లు.
ప్రస్తుత నిల్వ :- 4890.65 లక్షల గ్యాలన్లు.
2. గోగర్భం: 2893.80 అడుగులు
గరిష్ట నీటిమట్టం : 2894.00 అడుగులు
నిల్వ సామర్థ్యం : 2833.00 లక్షల గ్యాలన్లు.
ప్రస్తుత నిల్వ :- 2804.89 లక్షల గ్యాలన్లు.
3. ఆకాశగంగ: 863.10 మీటర్లు
గరిష్ట నీటిమట్టం : 865.00 మీటర్లు
నిల్వ సామర్థ్యం : 685.00 లక్షల గ్యాలన్లు.
ప్రస్తుత నిల్వ : 537.00 లక్షల గ్యాలన్లు.
4. కుమారధార: 896.15 మీ.
గరిష్ట నీటిమట్టం : 898.24మీ.
నిల్వ సామర్థ్యం : 4258.98 లక్షల గ్యాలన్లు.
ప్రస్తుత నిల్వ : 3739.05 లక్షల గ్యాలన్లు.
5. పసుపుధార: 893.20 మీటర్లు
గరిష్ట నీటిమట్టం : 898.24 మీటర్లు
నిల్వ సామర్థ్యం : 1287.51 లక్షల గ్యాలన్లు
ప్రస్తుత నిల్వ : 548.16 లక్షల గ్యాలన్లు












Click it and Unblock the Notifications