నారా లోకేష్‌కు ఓటమి రాసిపెట్టి ఉంది
Alla Ram Krishna Reddy: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధినేత్రి వైఎస్ షర్మిలకు బిగ్ షాక్ ఇచ్చారు ఆళ్ల రామకృష్ణారెడ్డి. ఇటీవలే కాంగ్రెస్ కండువా కప్పుకొన్న ఆయన అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూపులు సారించారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయం బాట పట్టారు.
ఈ మధ్యాహ్నం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో వైఎస్ జగన్‌ను కలిశారు. వైఎస్ఆర్సీపీలో పునఃప్రవేశం చేశారు. ఆ సమయంలో ఆయన వెంట రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, మంగళగిరి అసెంబ్లీ పార్టీ ఇన్‌ఛార్జ్ గంజి చిరంజీవి ఉన్నారు. ఆళ్ల రామకృష్ణారెడ్డిని ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు జగన్. పార్టీలోకి సాదర స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా ఆర్కే విలేకరులతో మాట్లాడారు. ఇంకో 30 సంవత్సరాల పాటు జగన్.. ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటోన్నానని అన్నారు. 175కు 175 అసెంబ్లీ స్థానాలను వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటుందనే ధీమాను వ్యక్తం చేశారు. మంగళగిరిలో పార్టీ అభ్యర్థిని గెలిపించడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు.
2019లో అగ్ర వర్ణ అభ్యర్థి చేతిలో నారా లోకేష్ ఓడిపోయారని, 2024 ఎన్నికల్లో బీసీ అభ్యర్థి చేతిలో ఆయనకు ఓటమి రాసిపెట్టి ఉందని అన్నారు. మంగళగిరి టికెట్‌ను బీసీ అభ్యర్థికి కేటాయించాలనే జగన్ నిర్ణయాన్ని తాను స్వాగతిస్తోన్నానని చెప్పారు. ఎవరికి టికెట్ ఇచ్చినా గెలుపు కోసం కృషి చేస్తానని ఆళ్ల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.
కాంగ్రెస్‌లోకి వెళ్లి తప్పు చేశాననే విషయం అర్థమైందని, అందుకే మళ్లీ వైఎస్ఆర్సీపీలోకి రావాలని భావించానని అన్నారు. జగన్ తనను అప్పుడూ ఒక సోదరుడిగానే చూశారని, ఇప్పటికీ తనపై అదే ప్రేమను చూపించారని చెప్పారు. తాను ఎప్పుడూ కూడా జగన్‌ను గానీ, పార్టీని గానీ, విధి విధానాలను గానీ విమర్శించలేదని గుర్తు చేశారు.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications