నగిరి వైసీపీ లీడర్ ఎవరు ?, గ్రావెల్ దందాలో మామూళ్లు, తమిళనాడుకు దర్జాగా?

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో గ్రానైట్ దందా, ఇసుక దందా, భూ దందా, ఎర్రచందనం స్మగ్లింగ్ జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్- తమిళనాడు రాష్ట్రాల సరిహద్దులో గ్రావెల్ దందా కూడా జోరుగా సాగిందని, దీనిపై చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం విచారణ జరిపించాలని తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

చిత్తూరు జిల్లాలోని నగిరి నియోజక వర్గానికి చెందిన వైసీపీకి చెందిన ఓ లీడర్ కు గ్రావెల్ దందాతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు ఉన్నాయి. చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రికి, ఆయన అనుచరులు వాళ్లు అడిగినంత డబ్బులు ఇచ్చిన కొన్ని సంస్థల నిర్వహకులు ఇష్టానుసారంగా కొండలను పిండి చేసి గ్రావైల్ దందాకు తెరలేపారని ఆరోపణలు ఉన్నాయి. ఇలా ఇష్టం వచ్చినట్లు గ్రావెల్ తోడేయడంతో గత వైసీపీ ప్రభుత్వం చేతికి చిప్ప మాత్రమే మిగిలిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

https telugu oneindia com news andhra-pradesh the-experiment-of-property-registrations-in-village-secretariats-has-been-a-complete-failure-399815 html

చిత్తూరు జిల్లాలో ఎక్స్ ప్రెస్ రహదారులు నిర్మిస్తున్న సంస్థలు సైతం గత వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన ఓ వ్యక్తి అండతో ఇష్టం వచ్చినట్లు గ్రావెల్ దందాకు తెరలేపి మట్టిని తొవ్వేశారని ఆరోపణలు ఉన్నాయి చిత్తూరు, విజయపురం మండలాల్లో గ్రావెల్ దందా పెద్ద ఎత్తున జరిగిందని, రోజుకు వందల కొద్ది ట్రిప్పర్లలో మట్టిని తరలించారని స్థానికులు ఆరోపించారు. జగన్నాథపురం, మహారాజపురం, పాతర్కాడు,, విజయపురంలో వైసీపీ నాయకుల అండతో ప్రతిరోజు వందలాది ట్రిప్పర్లలో గ్రావెల్ మట్టిని తమిళనాడుకు తరలించారని స్థానికులు ఆరోపించారు.

వైసీపీ ప్రభుత్వంలో ఎక్స్ ప్రెస్ రహదారులు నిర్మిస్తున్న సంస్థలతో పాటు కొందరు వైసీపీ నాయకులు కొండలను పిండి చేసి ఆ గ్రావెల్ ను అక్రమంగా తరలించారని స్థానికులు ఆరోపించారు. ఒక సర్వే నెంబర్ లో మట్టిని తవ్వుకుంటామని గనుల శాఖకు చెప్పి మరో సర్వే నెంబర్ లో అక్రమంగా మట్టిని తవ్వేశారని ఆరోపించారు. నగిరి నియోజక వర్గంలో ఓ వైసీపీ లీడర్ అడిగినంత డబ్బులు ఇచ్చేసి అక్రమంగా తమిళనాడుకు వందలాది ట్రిప్పర్ లారీల్లో గ్రావెల్ తరలించారని స్థానికులు ఆరోపించారు.

Allegations of illegal movement of gravel in Chittoor district under the YCP government

ఆ సందర్బంలో అక్రమ గ్రావెల్ దందాను అడ్డుకున్న టీడీపీ, బీజేపీ, జనసేన నాయకుల మీద అక్రమంగా కేసులు కూడా పెట్టించారని, ఆ కేసుల విచారణ ఇంకా పెండింగ్ లో ఉన్నాయని ఆ పార్టీల నాయకులు ఆరోపించారు. వైసీపీ పాలనతో ఆంధ్రప్రదేశ్- తమిళనాడు రాష్ట్రాల సరిహద్దులో జరిగిన గ్రావెల్ దందాపై విచారణ జరిపించాలని చిత్తూరు జిల్లాకు చెందిన టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల నాయకులు కూటమి ప్రభుత్వానికి మనవి చేశారు. వైసీపీ పాలనలో అక్రమంగా గ్రావెల్ దందాకు తెరలేపడంతో ప్రభుత్వానికి కోట్లాది రూపాయలు నష్టం వచ్చిందని ప్రజలు ఆరోపిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+