వీఆర్వో అసభ్య ప్రవర్తన, పాస్ పుస్తకాల కోసం కోరిక తీర్చాలని ఒత్తిడి
కర్నూలు జిల్లా కోసిగిలో పని చేస్తున్న బ్రహ్మయ్య విర్వో, పాస్ పుస్తకాల కోసం దరఖాస్తు చేసుకున్న ఓ మహిళ పై అసభ్యకరంగా ఫోన్లో మాట్లాడి వేధింపులకి గురి చేశాడు.
మంత్రాలయం: కర్నూలు జిల్లా కోసిగిలో పని చేస్తున్న బ్రహ్మయ్య విర్వో, పాస్ పుస్తకాల కోసం దరఖాస్తు చేసుకున్న ఓ మహిళ పై అసభ్యకరంగా ఫోన్లో మాట్లాడి వేధింపులకి గురి చేశాడు. వి.ఆర్వో. మాటలు సెల్లో రికార్డు చేసిన బాధితురాలు కుటుంబ సభ్యులకు తెలిపి ఎమ్.ఆర్.ఓ.కి ఫిర్యాదు చేసింది.
వివరాలు పరిశీలిసై పాస్ పుస్తకాల కోసం దరఖాస్తు చేసుకున్న ఆ మహిళను రోజు తన అఫీస్ చుట్టూ తిప్పుకుంటూ నిర్లక్ష్యం చేశాడు. దీంతో రెండు రోజుల తర్వాత ఆ మహిళకు ఫోన్ చేసి తన కోరికను తీరిస్తే నీ పాస్ పుస్తకాల పని చేస్తానని లేకపోతే నీ పని కాదుంటూ తనలో ఉన్న కోరికను బయట పెట్టి తన అఫీస్ కు ఎంతా తొందరగా వస్తే నీ పని అంతే తొందరగా పూర్తి చేస్తానని తనలోని కోరికను తెలిపాడు.

సమాజంలో విలువలు తెలిసినా ఓ అధికారే ఈ విధంగా మాట్లాడిన తీరు అమెను అశ్చర్యపరిచింది. దీంతో అవేదనకు గురియైనా ఆ మహిళ తన కుటుంబ సభ్యులకు విర్వో బాగోతాన్ని బయటపెట్టింది. దీంతో ఆ మహిళకు చెందిన బంధువులు విర్వో ఆఫీస్ పై దాడి చేయడానికి ప్రయత్నం చేయగా పరారీలో ఉన్నట్లు తెలిసింది.
ఈ విషయం పై స్థానిక తహసీల్దార్ రజనీకాంత్ రెడ్డిని వివరణ కోరగా... బ్రమ్మనందం అనే విర్వో మహిళా పై ఆసభ్యకరంగా ప్రవర్థించిన విషయం వాస్తవమేనని అందువలనే ఆయన లాంగ్ లీవ్ లో వెళ్లడం జరిగిందని, విర్వో కు సంబంధించిన రికార్డులు మొత్తం స్వాధీనం చేసుకున్నమని, ఈ విషయంపై విచారణ చేసి పై అదికారులకు నివేదికలు పంపుతున్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications