వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిపిఐ, కాంగ్రెసు పొత్తు: కొలిక్కి రాని సీట్ల పంపకం

By Pratap
|
Google Oneindia TeluguNews

Alliance between CPI and Congress not concluded
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెసు, సిపిఐ మధ్య పొత్తుల వ్యవహారం ఇంకా కొలిక్కి రాలేదు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణకు, తెలంగాణ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకు మధ్య శుక్రవారం వరంగల్ జిల్లా జనగామలో శుక్రవారం చర్చలు జరిగాయి. సిపిఐకి తొమ్మిది లేదా పది శానససభా స్థానాలు, ఒక పార్లమెటు సీటు ఇవ్వడానికి కాంగ్రెసు సముఖంగా ఉంది. అయితే, 22 శాసనసభా స్థానాలు, సిపిఐ మూడు లోకసభ స్థానాలు అడుగుతోంది.

ఇరు పార్టీల మధ్య రేపు శనివారం మరో దఫా చర్చలు జరిగే అవకాశం ఉంది. కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస), సిపిఐ కలిసి పోటీ చేస్తే బాగుంటుందని, అయితే తెరాస కలిసి రావడం లేదని నారాయణ అన్నారు. పొత్తులపై చర్చించేందుకే తాను జనగామ వచ్చినట్లు ఆయన తెలిపారు. పొత్తులపై తేలడానికి సమయం పడుతుందని అన్నారు.

సినీ నటులు బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని మెడలో వేసుకుని తిరుగుతున్నారని, అది పామై కరుస్తుందని అన్నారు. తాము వర్ధన్నపేట సీటు అడగలేదని, మహబూబాబాద్ నుంచి పోటీ చేస్తామని ఆయన చెప్పారు. సిపిఐకి ఖమ్మం లోకసభ సీటు ఇవ్వడానికి కాంగ్రెసు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది.

తెలంగాణ పునర్నిర్మాణం అనేవాళ్లు రాజకీయ అవకాశవాదులని పొన్నాల లక్ష్మయ్య తెరాస నాయకులను ఉద్దేశించి అన్నారు. తెరాస నుంచి పొత్తు ప్రతిపాదన రాలేదని ఆయన చెప్పారు. పొత్తులపై పొన్నాల లక్ష్మయ్య చర్చిస్తున్నారని తెలంగాణ పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. తెరాసతో పొత్తు అవకాశం లేదని ఆయన చెప్పారు. ఈ నెలాఖరునాటికి అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తామని చెప్పారు. సిపిఐతో పొత్తు విషయం రెండు రోజుల్లో కొలిక్కి వస్తుందని చెప్పారు. తెరాసతో పొత్తు అవకాశం లేదని కాంగ్రెసు తెలంగాణ నేత శ్రీధర్ బాబు కూడా అన్నారు.

English summary
Talks on alliance between CPI secretary K Narayana and Telangana PCC president Ponnala Lakshmaiah have not been concluded.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X