రంగంలోకి జవదేకర్: టిడిపితో బిజెపి పొత్తు కొలిక్కి

రెండు మూడు రోజులు ఇక్కడే ఉండి పొత్తుల వ్యవహారాన్ని ఓ కొలిక్కి తీసుకురావాలన్నదే ఆయన లక్ష్యమన్నట్లు ప్రచారం జరుగుతోంది. వీలైతే ఈ నెల 31వ తేదీ ఉగాది రోజున పొత్తుపై అధికారిక ప్రకటన వెలువడేలా చూడాలన్నది ఆయన ఆలోచనగా చెబుతున్నారు. గత కొద్ది రోజుల్లో చోటు చేసుకొన్న పరిణామాలు తెలుగుదేశం, బిజెపి నేతల మధ్య చర్చల్లో ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. అవి పునరావృతం కాకూడదని ఉభయులూ ఓ అంగీకారానికి వచ్చినట్లు తెలిసింది.
సీట్ల పంపకంపై చర్చలు సాగుతున్నట్లు సమాచారం. తాజాగా వెల్లడైన సమాచారం ప్రకారం బిజెపి తెలంగాణలో తొమ్మిది లోకసభ సీట్లు, 45 అసెంబ్లీ సీట్లు, సీమాంధ్రలో 6 లోకసభ సీట్లు, 20 అసెంబ్లీ సీట్లు కోరింది. అయితే తెలంగాణలో 6 ఎంపీ సీట్లు, 25అసెంబ్లీ సీట్లు, సీమాంధ్రలో 3 ఎంపీ సీట్లు, 8అసెంబ్లీ సీట్లు ఇవ్వడానికి సిద్ధపడింది.
సీట్ల సంఖ్యకు ప్రాతిపదికగా తీసుకోవాల్సిన అంశాలు, గత ఎన్నికల్లో వచ్చిన ఓట్లు, స్ధానిక సంస్థల ఫలితాలు, అభ్యర్థులు వంటి అంశాలపై ఉభయుల మధ్య సమాచార మార్పిడి జరుగుతోంది. స్థానికంగా సీట్ల వ్యవహారం తేలకపోతే అంతిమంగా బీజేపీ జాతీయ నేత అరుణ్ జైట్లీ రంగంలోకి దిగి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో మాట్లాడి దీనికి ముగింపు పలికే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.












Click it and Unblock the Notifications