విశాఖలో కూటమికి బిగ్ షాక్.. వైసీపీలో చేరిన కీలక నేత

అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేతల చేరికలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. జగన్‌ను గద్దె దించడమే లక్ష్యంగా టీడీపీ, బీజేపీ , జనసేన పార్టీలు కూటమి కట్టాయి. అయితే ఈ కూటమిపై మూడు పార్టీల్లోనూ వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. బీజేపీకి తక్కువ స్థానాలు కేటాయించడంతో పాటు, టీడీపీ నుంచి బీజేపీలో చేరిన వారికే టికెట్లు దక్కడంతో ...టీడీపీకి బీజేపీ షాడో పార్టీనా అంటూ ఆ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు కూటమి ఏర్పడిన తరువాత జనసేన పార్టీ నుంచి సైతం వ్యతిరేకతం వ్యక్తం అవుతుంది.

40 ఎమ్మెల్యే సీట్లు ఆశించిన జనసేన కార్యకర్తలకు భంగపాటు తప్పలేదు. కేవలం 21 స్థానాల్లో మాత్రమే జనసేన పోటీ చేయడంపై ఆ పార్టీ కార్యకర్తలు తమ అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేశారు. ఈ 21 స్థానాల్లో కూడా వేరే పార్టీల నుంచి వారికి టికెట్లు కేటాయించడంపై జనసేనలో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. జనసేన పార్టీలో టికెట్ దక్కని నేతలు బహిరంగంగానే తమ ఆక్రోశాన్ని వెళ్ళగక్కుతున్నారు.

Alliance leaders joined YCP

అభ్యర్థుల ప్రకటన టీడీపీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. జాబితాలో తమ పేర్లు లేకపోవడంతో పలువురు నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో సీనియర్ నాయకులకు సైతం టికెట్ దక్కని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే పలువురు నాయకులు పార్టీకి గుడ్ బై చెప్పారు. మరి కొందరు స్వతంత్ర అభ్యర్థులుగా రంగంలోకి దిగడానికి రెడీ అవుతున్నారు. ఈ మూడు పార్టీలోని అసంతృప్తి నేతలందరూ కూడా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు.

మంగళవారం సైతం వైసీపీలో చేరికలు భారీగా జరిగాయి. విశాఖ పర్యటనలో బస్సు యాత్ర నిర్వహిస్తోన్న సీఎం జగన్‌ను పలు పార్టీల నేతలు ఆయన్ను కలిసి పార్టీలో చేరారు. టీడీపీ నుంచి మాజీ మేయర్ పులుసు జనార్థనరావు, ఉపాధ్యక్షుడు కర్రి గోవింద్, కార్యదర్శి గొల్లపల్లి గోవింద్, వరప్రసాదరెడ్డి , సంపత్ కుమార్ వైసీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ గాజువాక ఎమ్మెల్యే అభ్యర్థి గుడివాడ అమర్నాథ్, పలువురు వైసీపీ నేతలు పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+