ఎమ్మెల్యేలకే దిక్కులేదు.. కార్యకర్తలను పట్టించుకుంటారా .. జగన్ 2.O కామెంట్స్ పై కూటమి నేతల రియాక్షన్

ఈసారి అధికారంలోకి వస్తే 30 ఏళ్లు మనదే పాలన.. ఈసారి కార్యకర్తల కోసం జగన్ 2.0 చూస్తారంటూ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ఈ క్రమంలోనే కూటమి నేతలు తమదైన శైలిలో జగన్ కు కౌంటర్లు ఇస్తున్నారు. సీఎంగా ఉండగా కనీసం ఎమ్మెల్యేలను కూడా కలవని జగన్.. ఇప్పుడు కార్యకర్తలకు అండగా ఉంటానంటే అది నమ్మేస్థితిలేదని అన్నారు. అందుకే నేతలు పార్టీ మారుతున్నారని అనగాని కామెంట్స్ చేశారు. తన ఐదేళ్ల పాలనలో జగన్ చేసిన మోసాలను భరించలేకే జనం మొట్టికాయలు వేశారని మంత్రి అనగాని సత్యప్రసాద్ ఫైర్ అయ్యారు. ఆ మొట్టి కాయలకు ఇంకా వాపులు కూడా తగ్గలేదని వ్యాఖ్యానించారు. జగన్ అహంకారాన్ని ప్రజలు గత ఎన్నికల్లో పాతాళానికి తొక్కేశారని.. ఈసారి జగన్‌ను, వైసీపీని బంగళాఖాతంలో కలపడం ఖాయం అని జోస్యం చెప్పారు.

అన్నీ వర్గాల వారిని పీల్చి పిప్పి చేసి.. సబ్ ప్లాన్ నిధులను సైతం మళ్లించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ రెడ్డికి సంక్షేమంపై మాట్లాడే అర్హత లేదని మండిపడ్డారు. మోసం గురించి జగన్ చెబుతుంటే ఐదు కోట్ల ఆంధ్రులు నవ్వుతున్నారని ఎద్దేవా చేశారు. కంపెనీలను బెదిరించి రాష్ర్టం నుండి వెళ్లగొట్టి జగన్ ఏపీ పరువును తీశారని అన్నారు. ఏపీ బ్రాండ్ ను సీఎం చంద్రబాబు పున:నిర్మిస్తుంటే.. జగన్ తట్టుకోలేక విషం కక్కుతున్నాడని ఆరోపించారు.

alliance leaders Reaction on Jagan 2 O comments

అలానే జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సైతం జగన్ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నాడు 175 కి 175 ఎమ్మెల్యేలు, 25కి 25 ఎంపీలు అనే వారని.. ఇప్పుడు వైఎస్‌ జగన్ ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయారని అన్నారు. నేను బటన్ నొక్కా.. బటన్ నొక్కా అని చెబుతున్న జగన్‌.. బటన్‌ నొక్కి ప్రజలకు బటర్ మిల్క్ ఇచ్చాడు అంటూ సెటైర్లు వేశారు. ఏపీలో వికసిత భారత్ ద్వారా అభివృద్ధి చేసి.. వైసీపీకి భవిష్యత్ లేకుండా చేస్తామన్నారు.

వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో గుండెపోటు అన్నారని.. జగన్ రెప్పకు దెబ్బ తగిలితే అది హత్య అని చెప్పారని మండిపడ్డారు. మీ చిన్నాన్నను హత్య చేస్తే కనపడదా..? అంటూ ఆదినారాయణరెడ్డి నిలదీశారు. జగన్ ది పెద్ద అంగడి.. అవినాష్, పెద్దిరెడ్డి, విజయసాయి రెడ్డి లది సూపర్ మార్కెట్.. మిగిలిన వైసీపీ వారిది చిల్లర అంగడి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అలానే పలువురు కూటమి నేతలు సైతం జగన్ పై తీవ్రస్థాయిలో వి మర్శలు గుప్పిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+