మోడీతో బాబు దోస్తీ: టీలో టిడిపి, సీమాంధ్రలో బిజెపి

హైదరాబాద్: రాష్ట్రంలో తెలుగుదేశం, బిజెపి కలిసి ఎన్నికల్లో సాగుతాయనే అంచనాలు తలకిందులయ్యాయి. రాష్ట్ర విభజనతో ఆ పార్టీల మధ్య స్నేహా ప్రయత్నాలు బెడిసికొట్టినట్లు కనిపిస్తున్నాయి. తెలంగాణలో తెలుగుదేశం నాయకులు బిజెపితో పొత్తును కోరుకుంటున్నారు. కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలను ఎదుర్కోవడానికి బిజెపి బలం తమకు ఉపయోగపడుతుందని తెలుగుదేశం తెలంగాణ నేతలు భావిస్తున్నారు.

తెలుగుదేశం నాయకులకు బిజెపి రాష్ట్ర నాయకుల నుంచి చుక్కెదురవుతోంది. తెలుగుదేశం పార్టీతో పొత్తు ప్రయత్నాలను తెలంగాణ నాయకులు మొదటి నుంచి కూడా వ్యతిరేకిస్తున్నారు. తెలంగాణకు అండగా నిలవడం తమకు మద్దతు పెరిగిందని, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన ప్రతిష్టను కోల్పోయారని బిజెపి నాయకులు భావిస్తున్నారు. ఈ స్థితిలో చంద్రబాబుతో స్నేహం వల్ల నష్టం జరుగుతుందని భావిస్తున్నారు.

Alliance with BJP: TDP wants in Telangana, BJP opposes

బిజెపి రాష్ట్రాధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి మొదటి నుంచి తెలుగుదేశం పార్టీతో పొత్తు వద్దని వాదిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయాలని తమ పార్టీ అధిష్టానం ఆదేశించిందని ఆయన శుక్రవారంనాడు చెప్పారు. సుష్మా స్వరాజ్ దిష్టిబొమ్మను తెలుగుదేశం పార్టీ నాయకులు సీమాంధ్రలో దగ్ధం చేయడంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. అది తెలుగుదేశం పార్టీ ద్వంద్వ నీతికి నిదర్శనమని ఆయన అన్నారు.

కాగా, సీమాంధ్రలో దానికి భిన్నమైన వాతావరణం ఉంది. తెలంగాణ బిల్లుకు బిజెపి సహకరించి మోసం చేసిందని తెలుగుదేశం సీమాంధ్ర నాయకులు విమర్శిస్తున్నారు. బిజెపితో పొత్తు పెట్టుకోవడం వల్ల నష్టం జరుగుతుందని వారు వాదిస్తున్నారు. అందుకు అనుగుణంగా పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బిజెపిపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీపై కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. విజయనగరంలో జరిగిన ప్రజాగర్జన సభలో ఆయన బిజెపిపై విరుచుకుపడ్డారు.

రాష్ట్ర విభజన విషయంలో నరేంద్ర మోడీ కబుర్లు చెప్పారని, మోడీ తగిన న్యాయం చేయలేదని చంద్రబాబు అన్నారు. బిజెపి పార్లమెంటులో సీమాంధ్రకు న్యాయం జరిగే విధంగా వ్యవహరించలేదని ఆయన అన్నారు. దీన్నిబట్టి సీమాంధ్రలో బిజెపితో పొత్తు పెట్టుకోవడానికి తెలుగుదేశం పార్టీ సిద్దంగా లేదని అర్థమవుతోంది. మొత్తంగానే, బిజెపి, తెలుగుదేశం పార్టీల మధ్య ఇరు ప్రాంతాల్లో కూడా ఎన్నికల పొత్తు కుదిరే అవకాశం లేకుండా పోయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+