శాఖల కేటాయింపు: లోకేష్‌కు ఐటీ, వైసిపి నుంచి వచ్చిన వారికి కీలక శాఖలు
కొత్త మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారికి సోమవారం శాఖలను కేటాయించారు. నారా లోకేష్‌కు ఐటీ, పంచాయతీరాజ్, గ్రామీణాబివృద్ధి, అఖిలప్రియకు పర్యాటకం, తెలుగు భాష-సంస్కృతి శాఖను అప్పగించారు.
అమరావతి: కొత్త మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారికి సోమవారం శాఖలను కేటాయించారు. నారా లోకేష్‌కు ఐటీ, పంచాయతీరాజ్, గ్రామీణాబివృద్ధి, అఖిలప్రియకు పర్యాటకం, తెలుగు భాష-సంస్కృతి శాఖను అప్పగించారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ఆదినారాయణ రెడ్డి, సుజయ కృష్ణ రంగారావులకు కీలక శాఖలు అప్పగించారు. మంత్రి గంటా శ్రీనివాస రావు శాఖ మారుతుందని ప్రచారం జరిగింది. కానీ మారలేదు.
మంత్రి కొల్లు రవీంద్ర శాఖ మారినా మంచి శాఖలు వచ్చాయి. యనమల, కేఈవంటి సీనియర్ల శాఖలు మారలేదు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన వద్ద జీఏడీ, సినిమాటోగ్రఫీ, మైనార్టీ సంక్షేమం - ఉపాధి, మంత్రులకు కేటాయించని ఇతర శాఖలు.

కేఈ కృష్ణమూర్తి - ఉపముఖ్యమంత్రి, రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలు
నిమ్మకాయల చినరాజప్ప - ఉపముఖ్యమంత్రి, హోం, విపత్తు నిర్వహణ శాఖలు
యనమల రామకృష్ణుడు - ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు, శాసనసభా వ్యవహారాలు
నారా లోకేష్ - ఐటీ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి
కిమిడి కళా వెంకట్రావు - ఇంధనశాఖ
కింజరాపు అచ్చెన్నాయుడు - రవాణా, బీసీ సంక్షేమం, చేనేత, జౌళిశాఖ
వెంకట సుజయ్‌కృష్ణ రంగారావు - భూగర్భ, గనుల శాఖ
సీహెచ్. అయ్యన్నపాత్రుడు - రోడ్లు, భవనాల శాఖ
గంటా శ్రీనివాసరావు - మానవవనరుల అభివృద్ధి, ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత విద్యా శాఖ
కొత్తపల్లి శామ్యూల్ జవహర్ - ఎక్సైజ్‌శాఖ
పితాని సత్యనారాయణ - కార్మిక, ఉపాధి, శిక్షణ, పరిశ్రమలు శాఖ
పైడికొండల మాణిక్యాల రావు - దేవాదాయ శాఖ
కామినేని శ్రీనివాసరావు - ఆరోగ్య, వైద్య విద్య శాఖ
కొల్లు రవీంద్ర - క్రీడలు, న్యాయ, నైపుణ్యాభివృద్ధి, ఎన్‌ఆర్‌ఐ సంబంధాల శాఖ
దేవినేని ఉమా మహేశ్వరరావు - జల వనరుల శాఖ
నక్కా ఆనంద బాబు - సామాజిక, గిరిజన సంక్షేమం
ప్రత్తిపాటి పుల్లారావు - ఆహార, పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాలు, ధరల నియంత్రీకరణ
శిద్దా రాఘవరావు - అటవీ, వాతావరణ, శాస్త్ర సాంకేతిక
పొంగూరు నారాయణ - పురపాలక, పట్టణాభివృద్ధి
సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి - వ్యవసాయం.. అనుబంధ శాఖలు, ఉద్యానశాఖ
ఆదినారాయణ రెడ్డి - మార్కెటింగ్, వన్యప్రాణుల సంరక్షణ, పాడి పరిశ్రమ, మత్స్య శాఖ
భూమా అఖిల ప్రియ - పర్యాటకం, తెలుగు భాష, సంస్కృతి
కాల్వ శ్రీనివాసులు - గ్రామీణ గృహ నిర్మాణం, సమాచార, పౌర సంబంధాలు
పరిటాల సునీత: సెర్ప్, మహిళా శిశు సంక్షేమం, దివ్యాంగుల, వృద్ధుల సంక్షేమం
అమరనాథ్ రెడ్డి - పరిశ్రమలు, ఆహార, వ్యవసాయ ఉత్పత్తులు, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్












Click it and Unblock the Notifications