అల్లు అర్జున్ కు మరో అరుదైన అవకాశం
తెలుగు చలనచిత్ర పరిశ్రమ నుంచి మొదటిసారిగా జాతీయస్థాయిలో ఉత్తమ నటుడి అవార్డు అందుకోబోతున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు మరిన్ని మైలురాళ్లు తోడవుతున్నాయి. ప్రసిద్ధ సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఇన్ స్టాగ్రామ్ తో జరిగిన కొలాబరేషన్ లో భాగంగా బన్నీ తన రోజువారీ జీవితాన్ని ప్రజలకు వీడియో రూపంలో చూపించే అరుదైన అవకాశాన్ని అందుకున్నారు. దీనికోసం ఒక ప్రత్యేక టీమ్ హైదరాబాద్ వచ్చి దగ్గరుండి మరీ అల్లు అర్జున్ రోజువారీ కార్యక్రమాలను షూట్ చేశారు.
ఈ వీడియోపై అభిమానులు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఉదయం నిద్ర లేచిన తర్వాత ధ్యానం చేసుకోవడం, గార్డెన్ లో కాఫీ తాగడంలాంటి పనులన్నీ పూర్తిచేసుకొని కారులో రామోజీ ఫిలింసిటీకి షూటింగ్ కోసం వెళ్లడం, అక్కడకు వెళ్లిన తర్వాత క్యారవాన్ లో దర్శకుడు సుకుమార్ తో కలిసి ఆరోజు తీయాల్సిన సన్నివేశాల తాలూకు డైలాగులు ప్రాక్టీస్ చేయడం, తర్వాత మేకప్ వేసుకొని పుష్ప2 షూటింగ్ లో పాల్గొనడంలాంటివన్నీ చూపించారు.

ఎర్రచందనం దుంగల్ని లారీలోకి ఎత్తుతున్న సమయంలో పుష్పరాజ్ అక్కడికి వచ్చి అందరికీ ఆదేశాలిచ్చే సీన్లను పూర్తిచేశారు. ఈ సినిమాలో బన్నీ గెటప్ ఎలా ఉండబోతోందో ఈ వీడియోతో దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులందరికీ ఒక స్పష్టత వచ్చింది. చాలా తక్కువ నిడివిలోనే అల్లు అర్జున్ రోజువారీ షెడ్యూల్ ఎలా ఉంటుందో ఇన్ స్టాగ్రామ్ చూపించింది. పుష్ప2 సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.
ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదల చేసిన తర్వాతే బిజినెస్ ను పూర్తిచేయాలనే ఆలోచనలో మైత్రీ మూవీ మేకర్స్ వారు ఉన్నారు. ఇన్ స్ట్రాగ్రామ్ లో ఈ వీడియోను పోస్ట్ చేయడం, వెంటనే అది వైరల్ కావడం, స్క్రీన్ షాట్లు చక్కర్లు కొట్టడం చకచకా జరిగిపోయాయి.












Click it and Unblock the Notifications