పవన్ ఇష్టం, చిరు ప్రాణం: అర్జున్, జనసేన పార్టీపై నో

తనకు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టమని, చిరంజీవి అంటే ప్రాణమని ప్రకటించారు. అదే సమయంలో పవన్ స్థాపించిన జనసేన పార్టీపై స్పందించేందుకు నిరాకరించారు. తూర్పు గోదావరి జిల్లాలో ఓ కళాశాల క్యాంపస్‌లో నిర్వహించిన మైత్రి యువజనోత్సవాల్లో రేసుగుర్రం సినిమా యూనిట్‌తో కలిసి అల్లు అర్జున్ పాల్గొని చిరు, పవన్‌లపై పై విధంగా స్పందించారు.
పవన్ రాజకీయ పార్టీని స్థాపించడంతో మెగా కుటుంబ సభ్యులు చిరంజీవి వైపు ఉండగా, పవన్ ఒక్కరే జనసేన వైపు ఉన్న విషయం తెలిసిందే! మెగా సోదరులలో ఒకరైన నాగబాబు తన అన్నయ్య చిరంజీవి వైపే ఉంటానని ప్రకటించారు. రామ్ చరణ్ తేజ కూడా చిరంజీవి వైపే ఉన్నారు. అయితే, నాగబాబు తనయుడు వరుణ్ తేజ మాత్రం కొంచెం భిన్నంగా స్పందించారు. పవన్ ప్రసంగం బాగుందని అభిప్రాయపడ్డారు.
పవన్ కళ్యాణ్ రానున్న సార్వత్రిక ఎన్నికలలో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీతో కలిసి నడిచే అవకాశాలున్నాయి. ఇప్పటికే బిజెపికి మద్దతు ప్రకటించిన పవన్... త్వరలో టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుతో మరోసారి భేటీ కానున్నారు. ఈ ఎన్నికల్లో బిజెపి, టిడిపి, జనసేన, లోక్‌సత్తా పార్టీలు కలిసి నడిచే అవకాశాలున్నాయి.












Click it and Unblock the Notifications