ఇటు పవన్ కళ్యాణ్‌కు మద్దతు! అటు వైసీపీ అభ్యర్తి గెలుపు కోసం అల్లు అర్జున్!!
ఎన్నికల గడువు అత్యంత సమీపంలో ఉండటంతో రాజకీయ పార్టీల నేతలు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలంటూ పార్టీల అధినేతలు ప్రజలను కోరుతున్నారు. మరోవైపు, రాజకీయ నాయకులకు మద్దతుగా సినీ ప్రముఖులు కూడా రంగంలోకి దిగుతున్నారు. ఇప్పటికే పలువురు నటులు రాజకీయ పార్టీలకు మద్దతుగా ప్రచారం కూడా నిర్వహిస్తున్నారు.
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు మద్దతుగా మెగా కుటుంబంలో చాలా మంది హీరోలు, నటులు ఆయన పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మరోవైపు, ప్రముఖ సినీ హీరో అల్లు అర్జున్ కూడా పవన్ కళ్యాణ్‌కు సోషల్ మీడియా వేదికగా మద్దతు పలికారు. ఒక కుటుంబసభ్యుడిగా పవన్ కళ్యాణ్‌కు ఎప్పుడూ తన మద్దతు ఉంటుందని పేర్కొన్నారు. పవన్ అనుకున్నది సాధించాలని ఆకాంక్షించారు.

మరోవైపు, అల్లు అర్జున్ తన స్నేహితుడైన నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో ఉన్న రవిచంద్ర కిషోర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపేందుకు శనివారం ఉదయం వెళుతున్నారు. తన భార్య స్నేహారెడ్డితో కలిసి ఆయన నంద్యాలకు వెళ్లనున్నారు. శుభాకాంక్షలు తెలపడానికే పరిమితమవుతారా? లేక ఆయనకు మద్దతుగా అల్లు అర్జున్ ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొంటారా? అనేది ఉత్కంఠగామారింది.
నంద్యాలకు వెళ్లి తన స్నేహితుడికి అల్లు అర్జున్ వెళ్లి శుభాకాంక్షలు చెబుతుండటంతో రవిచంద్ర కిషోర్ రెడ్డి అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అల్లు అర్జున్‌కు ఘన స్వాగతం పలికేందుకు సిద్దమవుతున్నారు. అయితే, ఓ వైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మద్దతు పలికి.. ఇప్పుడు వైసీపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న రవిచంద్ర కిషోర్‌కు శుభాకాంక్షలు తెలిపేందుకు అల్లు అర్జున్ వెళుతుండటం చర్చనీయాంశంగా మారింది. అయితే, స్నేహితుడు కావడంతోనే రవిచంద్రకు అల్లు అర్జున్ మద్దతు తెలుపుతున్నట్లు తెలుస్తోంది.
-
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..!












Click it and Unblock the Notifications