అల్లు అర్జున్ పక్కన నటించేందుకు తిరస్కరించిన ముగ్గురు స్టార్ హీరోయిన్లు

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు పుష్ప సినిమాలో నటనకు జాతీయ అవార్డు ప్రకటించారు. దీనిపై ఆయనకు దేశవ్యాప్తంగా అన్ని సినీ పరిశ్రమల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప2 షూటింగ్ లో పాల్గొంటున్నారు. మొదటి భాగం బాలీవుడ్ లో కూడా ఘనవిజయం సాధించడంతో తర్వాత రాబోయే పుష్ప2పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.

పుష్ప మొదటి భాగం సూపర్ హిట్ అవడంలో ఆ సినిమాలోని పాట ఒకటి కీలక పాత్ర పోషించింది. కథానాయిక సమంత ప్రత్యేకపాత్రలో ఆ పాటలో నర్తించారు. ఊ అంటావా మావా.. ఊహూ అంటావా.. మావా అంటూ సాగే ఆ పాటకు అన్ని భాషల్లో విపరీతమైన ఆదరణ దక్కింది. పుష్ప2 లో కూడా స్పెషల్ సాంగ్ ను దర్శకుడు సుకుమార్ డిజైన్ చేశారు. ఈ పాటలో డాన్స్ చేయడానికి ముగ్గురు స్టార్ హీరోయిన్లను సంప్రదించారు.

allu arjun movie pushpa 2 update

అయితే ఆ ముగ్గురు స్టార్ హీరోయిన్లు ఆఫర్ ను తిరస్కరించారు. అల్లు అర్జున్ పక్కన ఆఫర్ వస్తే కాదంటారేమిటంటూ చిత్ర బృందం తలలు పట్టుకుంది. పుష్పలో ప్రత్యేక గీతంలో నర్తించిన సమంతను ఆ తర్వాత చాలా సినిమాల నిర్మాత, దర్శకులు తమ సినిమాల్లో కూడా ఐటమ్ సాంగ్ చేయమంటూ కోరారు. పారితోషికం కూడా భారీగా ఇస్తానన్నారు. ఐటమ్ సాంగ్ చేసినందుకు తాను ఐటమ్ అయిపోయానంటూ సమంత బాధపడింది. ఈ విషయాన్ని తనకు సన్నిహితంగా ఉండే ఇతర హీరోయిన్లతో కూడా పంచుకుంది.

ఆ ముగ్గురు స్టార్ హీరోయిన్లు కూడా సమంతకు సన్నిహితులే. పుష్ప2లో స్పెషల్ సాంగ్ లో డాన్స్ చేస్తే తమను కూడా కచ్చితంగా అలాగే ఐటమ్ గర్ల్స్ గా ముద్రవేస్తారని భయపడ్డారు. దీంతో వారు ఈ ఆఫర్ ను తిరస్కరించారు. అయితే పారితోషికం కూడా చాలా తక్కువగా ఇస్తామనడం మరో కారణం. కేవలం కోటిరూపాయలే ఇస్తామనడంతో వారు ముందుకు రాలేదు. ఎవర్ని ఎంపిక చేయాలా? అంటూ చిత్ర బృందం తలలు పట్టుకొని కూర్చుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+