పవన్, చిరు, శేఖర్: మామల నడుమ అర్జున్, ప్రచారం!

హైదరాబాద్: స్టైలిష్ హీరో అల్లు అర్జున్ ముగ్గురు మామల నడుమ చిక్కుకుపోయారు! రానున్న సార్వత్రిక ఎన్నికలలో ఆయన పెద్ద మేనమామ, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి కాంగ్రెసు పార్టీలో ఉన్నారు. మరో మేనమామ, వపర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి బిజెపికి, ఆ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీకి మద్దతు పలుకారు.

తాజాగా, ఆయనకు పిల్లనిచ్చిన మామ శేఖర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరఫున ఇబ్రహీంపట్నం బరిలో నిలబడుతున్నారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ ఎవరికైనా ప్రచారం చేస్తారా అనే ఆసక్తికర చర్చ సాగుతోంది.

పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించినప్పుడే నాగబాబు మాట్లాడుతూ.. అభిమానులు, కుటుంబ సభ్యులు చిరు వెంటే ఉంటామని చెప్పారు. అల్లు అర్జున్ పెదవి విప్పక పోయినప్పటికీ చిరుతోనే ఉంటారని చెప్పవచ్చు.

అల్లు అర్జున్

అల్లు అర్జున్

అల్లు అర్జున్ మేనమావయ్య చిరంజీవి కాంగ్రెసులో, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి మోడీకి మద్దతు పలకగా, ఆయనకు పిల్లనిచ్చిన మావయ్య శేఖర్ రెడ్డి తెరాస తరఫున ఇబ్రహీంపట్నం బరిలో నిలబడుతున్నారు.

అల్లు అర్జున్

అల్లు అర్జున్

ముగ్గురు మావయ్యలు మూడు పార్టీలలో ఉండటంతో అల్లు అర్జున్ ప్రచారం చేస్తారా? ఎవరి తరఫున ప్రచారం చేస్తారు? అనే చర్చ సాగుతోంది.

అల్లు అర్జున్

అల్లు అర్జున్

ఇప్పటికే మెగా కుటుంబ సభ్యులు చిరు వెంటే ఉంటామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ ప్రచారం చేయాల్సి వస్తే సీమాంధ్రలో కాంగ్రెసు పార్టీ తరఫున చేయవచ్చునంటున్నారు.

అల్లు అర్జున్

అల్లు అర్జున్

తెలంగాణలో ఏ పార్టీ తరఫున ప్రచారం చేయక పోయినప్పటికీ తనకు పిల్లనిచ్చిన మావయ్య తరఫున ఇబ్రహీంపట్నంలో మాత్రం ప్రచారం చేయవచ్చుని భావిస్తున్నారు. కాగా, అల్లు అర్జున్... తెరాస తరఫున పోటీ చేస్తున్న శేఖర్ రెడ్డి కూతురు స్నేహారెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

అల్లు అర్జున్న

అల్లు అర్జున్న

అలా కాకపోయినా అల్లు అర్జున్ సీమాంధ్రలో, తెలంగాణ ప్రాంతాల్లో ఎవరికీ ప్రచారం చేయక పోవచ్చునని కూడా అబిప్రాయపడుతున్నారు. అయితే, పిల్లనిచ్చిన మావయ్య అడిగితే మాత్రం ఇబ్రహీంపట్నంలో ప్రచారం చేసే అవకాశాలను కొట్టిపారేయలేమంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+