స్టార్ హీరోపై శ్రీలీల ఫిర్యాదు..?
తెలుగు క్రష్.. టాలీవుడ్ క్రష్ ఎవరంటే అందరూ ఠక్కున చెప్పే పేరు శ్రీలీల. అందంతోపాటు అదృష్టం కూడా ఆమెకు తోడుగా ఉంటోంది. అగ్ర కథానాయకుల నుంచి చిన్న స్థాయి కథానాయకుల వరకు ప్రతి ఒక్కరూ శ్రీలీల తమ సినిమాలో చేయాలని కోరుతున్నారు. అంతేకాదు.. కొంతమంది హీరోలైతే తమ రెమ్యునరేషన్ తగ్గించుకొని శ్రీలీలకు అవకాశం కల్పించాలని నిర్మాత, దర్శకులపై ఒత్తిడి తెస్తున్నారు. శ్రీలీల నటించిందంటే సినిమా హిట్ అనే సెంటిమెంట్ తెలుగు చిత్రపరిశ్రమలో ఏర్పడింది.
స్టార్ హీరోయిన్లు ఫినిష్ : ఇటువంటి క్రేజ్ గతంలో కానీ, ప్రస్తుతం కానీ ఏ హీరోయిన్ కు రాలేదంటే అతిశయోక్తి కాదు. శ్రీలీల తుమ్మినా, దగ్గినా అది పెద్ద వార్తయిపోతోంది. శ్రీలీల కూడా చాలా తెలివిగా సినిమాలను ఒప్పుకుంటోంది. ప్రస్తుతం ఆమె చేతిలో 12 సినిమాలున్నాయంటే అతిశయోక్తి కాదు. స్టార్ హీరోయిన్లంతా ఆమె ధాటికి మరుగున పడిపోతున్నారు. తాజాగా అల్లు అర్జున్ కూడా ఆమెతో ఒక సినిమా చేయబోతున్నారు. పుష్ప2 పూర్తయిన తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమా చేయబోతున్నారు. గుంటూరు కారం, ఆదికేశవ లాంటి భారీ ప్రాజెక్టులు సిద్ధమవుతున్నాయి.

పదే పదే ఫోన్లు చేస్తుంటే : కొద్దిరోజుల క్రితం తన సినిమాలో నటించాలంటూ కన్నడకు చెందిన స్టార్ హీరో ఆమెను తీవ్ర ఒత్తిడికి గురిచేశారు. అతని క్యారెక్టర్ గురించి తెలుసుకున్న శ్రీలీల అందుకు నో చెప్పింది. పదే పదే ఫోన్లు చేస్తూ కామెంట్స్ చేస్తుండటంతోపాటు హెచ్చరించడంలాంటివి అతను చేస్తున్నాడు. దీంతో వెంటనే పోలీస్ స్టేషన్ లో ఆ హీరోపై ఫిర్యాదు చేసింది. శ్రీలీల ధైర్యంగా చేసిన పనికి అందరినుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.












Click it and Unblock the Notifications