జాతీయ అవార్డులు ఎలా వస్తాయో ఇప్పటికైనా అర్థమైందా?

ఇటీవలే ప్రకటించి జాతీయ అవార్డుల్లో తెలుగు సినిమా సత్తా చాటింది. అవార్డులు ప్రారంభించి 69 సంవత్సరాలవుతున్నప్పటికీ ఇంతవరకు తెలుగు భాష నుంచి జాతీయ ఉత్తమ నటుడిగా ఎవరూ ఎంపిక కాలేకపోయారు అనేకన్నా.. కమిటీ ఎంపిక చేయలేదని చెప్పవచ్చు. స్వాతిముత్యం, సాగర సంగమం, శంకరాభరణం, కరుణామయుడు, నర్తనశాల, మాయాబజార్, మూగమనసులు.. ఇలా చెప్పుకుంటూ పోతే నటనకు కొత్త భాష్యం చెప్పిన సినిమాలు వందల్లో ఉంటాయి.

ఈ ఏడు దశాబ్దాల్లో ఎన్నో చిత్రరాజాలు వెండితెరపై తళుకులీనాయి. ఎందరో నటులు తమ ప్రతిభా పాటవాలతో ప్రజలు ఆకట్టుకున్నారు. మరికొందరు అద్భుతంగా చేసి నటనకు కొత్త భాష్యం చెప్పారు. వీరంతా ప్రజలను, ప్రేక్షకులను ఆకట్టుకున్నారేకానీ కేంద్రంలో అధికారంలో ఉండే పెద్దలను మాత్రం ఆకట్టుకోలేకపోయారు. హఠాత్తుగా తెలుగు భాష నుంచి జాతీయ ఉత్తమ నటుడిని ఎంపిక చేశారు. రాజకీయంగా సౌలభ్యం కోసమే ఈ ఎంపిక ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

National Film Awards

రెండు తెలుగు రాష్ట్రాల్లో త్వరలోనే ఎన్నికలు జరగబోతున్నాయి. ముందుగా తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి. తర్వాత ఏపీ వంతు. ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తూ రాజకీయానికి వాడుకోవడంలో కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వం ముందంజలో ఉంటుందని కాంగ్రెస్ నాయకులు తరుచుగా విమర్శలు చేస్తుంటారు. అలాగే జాతీయ అవార్డులను కూడా వారి రాజకీయ స్వలాభానికి వాడుకున్నారంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు నేరుగా విమర్శలు గుప్పిస్తున్నారు.

Allu Arjun

ఒక సామాజిక వర్గాన్ని దరి చేర్చుకోవడంతోపాటు ఆ వర్గాన్ని దన్నుగా చేసుకొని సొంతంగా బలపడాలనే రాజకీయ ఎత్తులు కూడా ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. హత్యలు, స్మగ్లింగ్ చేస్తూ చట్ట విరుద్ధ కార్యక్రమాలకు పాల్పడే పాత్రలో నటించిన నటుడికి అవార్డు దక్కడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆశ్చర్యానికి గురిచేసినా, అసహనానికి గురిచేసినా, మూర్ఛ పోయేంత పనైనా, ఏది జరిగినా.. ఒకటి మాత్రం నిజం. తెలుగు నటుడికి జాతీయ అవార్డు వచ్చింది. అదే అందరినీ సంతోషానికి గురిచేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+