జయప్రద అందంపై ములాయం: అమర్ సింగ్ ఫైర్

Amar Singh hits out at Mulayam for commenting on Jaya Prada
లక్నో: రాంపూర్ పార్లమెంటు సభ్యురాలు, సినీ నటి నటి జయప్రదపై సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత ములాయం సింగ్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై మాజీ ఎస్పీ నేత అమర్ సింగ్ తీవ్రంగా మండిపడ్డారు. జయప్రద చూడచక్కగా ఉంటారనీ ఆమె తనతో పారిపోయిందని ములాయం సింగ్ అన్నారని అమర్ సింగ్ గుర్తు చేస్తూ మండిపడ్డారు.

తన వల్లనే ఇద్దరు సినీ తారలు జయప్రద, జయాబచ్చన్ ఎస్పీలోకి వచ్చారని, జయా బచ్చన్ పార్టీతోనే ఉన్నారని, జయబచ్చన్ తనను వదిలేసి ములాయంతో ఉండిపోయిందని తాను ఏ రోజు కూడా అనలేదని ఆయన వ్యాఖ్యానించారు.

ములాయం సింగ్‌కు మతి తప్పినట్లుందని, తాను ఎస్పీ నుంచి పారిపోలేదని, తనను సస్పెండ్ చేశారని, జయప్రద కూడా అనివార్యంగా పార్టీ నుంచి బయటకు రావాల్సి వచ్చిందని అమర్ సింగ్ అన్నాడు.

చూడచక్కగా ఉన్నారు కాబట్టే తాను ఇద్దరు సినీ తారలను పార్టీలోకి తెచ్చానని, వారి లక్షణాల కారణంగా పార్టీలోకి తెచ్చానని ఆయన అన్నారు. జయప్రద ములాయం సింగ్‌ను తండ్రిలా భావిస్తుందని, అయినా మలాయం ఆమె అందం గురించి మాట్లాడుతున్నాడని అమర్ సింగ్ అన్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+