అమరావతిలో భూమి కోసం మెడపై కత్తి పెట్టి మరదలి రేప్, న్యూడ్ ఫోటోలతో..
విజయవాడ: నవ్యాంధ్ర ప్రదేశ్ రాజధానిలో షాకింగ్ విషయం వెలుగు చూసింది. ఓ వ్యక్తి ఓ యువతి పైన లైంగిక దాడికి పాల్పడ్డాడు. అందుకు కారణం తెలిస్తే అందరూ ఆశ్చర్యపోతారు. విభజన నేపథ్యంలో ఏపీ రాజధానిగా అమరావతిని ఎంపిక చేసిన విషయం తెలిసిందే.
అమరావతిలో బాధిత యువతి పేరిట పెద్ద ఎత్తున భూమి ఉంది. ఆ భూమిని దక్కించుకునేందుకు నిందితుడు ఆమె పైన లైంగిక దాడికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. లైంగిక దాడి పైన ఫిర్యాదు చేయడంతో ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. అయితే, అతను పెళ్లి చేసుకుంటానని చెప్పేది భూమి కోసం కావడం గమనార్హం.

అయితే, ఈ సంఘటన హైదరాబాదులో చోటు చేసుకుంది. యువతి పైన హైదరాబాదులోని ప్రగతి నగర్లో ఈ దారుణానికి పాల్పడ్డాడు. నిందితుడు యువతి మెడ పైన కత్తి పెట్టి అత్యాచారం చేశాడు. అమరావతిలో యువతి పైన పెద్ద ఎత్తున భూమి ఉండటంతోనే నిందితుడు ఈ దారుణానికి ఒడిగట్టాడని పోలీసులు తెలిపారు.
ఆ యువతికి నిందితుడు బావ వరుస అవుతాడని తెలుస్తోంది. అంతేకాదు, అత్యాచారం చేసిన సమయంలో వాటిని వీడియో తీశాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే నీ న్యూడ్ ఫోటోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు.
కోస్గిలో విషాదం
కర్నూలు జిల్లా కోస్గిలో విషాదం చోటు చేసుకుంది. ఈత కోసం చెరువుకు వెళ్లిన నలుగురు చిన్నారులు మృతి చెందారు. కోస్గి శివారు గూగేని చెరువులో చిన్నారులు మృత్యువాత పడ్డారు. చెరువులో ఈత కొట్టేందుకు దిగిన చిన్నారులు నీటిలో మునిగి ఊపిరాడక ప్రాణాలు విడిచారు.
మృతులను వెంకటేశ్ (12), నరసింహులు (11), నరసింహులు (12)గా గుర్తించారు. మరో బాలుడి వివరాలు తెలియాలి. ఉరుకుంద అనే బాలుడి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications