ఈ ప్రాంతాలు స్థానిక ఎన్నికల నుంచి మినహాయింపు - అసలు కారణం..!!

ఏపీలో స్థానిక ఎన్నికలకు సర్వం సిద్దమైంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు వీలుగా ఎన్నికల సంఘం సమాయత్తం అవుతోంది. నవంబర్ నెలాఖరులోకా మొత్తం ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్దం అవుతున్నాయి. దీంతో, దాదాపు రెండు నెలలు రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండనుంది. ఈ క్రమంలో రాజధాని అమరావతి గ్రామాల్లో ఎన్నికల నిర్వహణ పైన కీలక నిర్ణయం తీసుకున్నారు. కొన్ని గ్రామాలకు మినహాయింపు ఇచ్చారు.

రాష్ట్రంలో స్థానిక ఎన్నికలకు మరో రెండు రోజుల్లో షెడ్యూల్ విడుదల కానుంది. రాజధాని అమరావతి పరిధిలో గ్రామాల విషయంలో ప్రభుత్వానికి ఎన్నికల నిర్వహణ పైన కీలక ప్రతిపాదన లను సమర్పించింది. తొలి విడత భూ సమీకరణ గ్రామాలు, మలి విడతలో భూ సమీకరణ చేస్తున్న గ్రామాలతో పాటు భవిష్యత్ లో విమానాశ్రయం ఏర్పాటుకు భూ సమీకరణ చేసే గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికలకు మినహాయింపు ఇవ్వాలని సీఆర్డీఏ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఇందులో తొలి విడత సమీకరణ గ్రామాల్లో 25 గ్రామ పంచాయితీలు ఉన్నాయి. వీటికి 2021 లోనూ ఎన్నికలు నిర్వహించ లేదు. కాగా, ఈ సారి వీటిలో ఉండవల్లి, పెనుమాక, ఎర్రబాలెం, నవులూరు, నిడమర్రు, బేతపూడి గ్రామాలను తాడేపల్లి - మంగళగిరి కార్పోరేషన్ పరిధిలో కలపటం తో వాటికి ఎన్నికలు జరుగుతాయి.

స్థానిక ఎన్నికల షెడ్యూల్ ఫిక్స్ - ఏ ఎన్నిక ఎప్పుడంటే, ఇలా వరుసగా..!!
స్థానిక ఎన్నికల షెడ్యూల్ ఫిక్స్ - ఏ ఎన్నిక ఎప్పుడంటే, ఇలా వరుసగా..!!
amaravati-villages-may-get-exemption-from-local-body-elections-as-crda-latest-proposals-here-the-li

సీఆర్డీఏ కీలక ప్రతిపాదనలతో

మంగళగిరి మండలంలోని నీరుకొండ, కురగల్లు, క్రిష్ణాయపాలెం, తుళ్లూరు మండలంలో తొలి విడత భూ సమీకరణ జరిగిన గ్రామ పంచాయితీలతో పాటుగా గుంటూరు, పల్నాడు జిల్లాల్లో 40 గ్రామ పంచాయితీలకు స్థానిక సంస్థల ఎన్నికల నుంచి మినహాయింపు ఇవ్వాలని సీఆర్డీఏ ప్రభుత్వానికి నివేదించింది. తుళ్లూరు మండలంలోని 16 గ్రామ పంచాయితీలు, మంగళగిరి మండలంలోని 3 పంచాయితీలు ప్రస్తుతం భూ సమీకరణ చేసినా.. భవిష్యత్ లో భూ సమీకరణ చేసే 40 గ్రామ పంచాయితీలకు స్థానిక ఎన్నికల నుంచి మినహాయింపు కోరారు. మలివిడత భూ సమీకరణలో గుంటూరు జిల్లాలో 22, పల్నాడు లో 18 కలిపి మొత్తం 40 గ్రామ పంచాయితీలను మినహాయించాలని ప్రతిపాదనలు పంపారు. వీటి పైన తుది నిర్ణయం తీసుకోనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+