అమరావతిలో ఎడ్యుకేషనల్ హబ్... ఒప్పందాల ప్రకారమే రైతులకు భూములు ..బోత్స
అన్ని ప్రాంతాలను సమాన అభివృద్ది పరచాలన్నదే... ప్రభుత్వ అభిమతమని మంత్రి బొత్స సత్యనారయణ స్పష్టం చేశారు. అమరావతిలో అసంపూర్తిగా ఉన్న భవనాలు పూర్తి చేస్తామని ఆయన చెప్పారు. అనంతరం ఎడ్యుకేషన్ హబ్‌గా మార్చనున్నట్టు చెప్పారు. రైతులు ఎలాంటీ అందోళనలు చెందాల్సిన అవసరం లేదని చెప్పారు.
రైతులు ఇచ్చిన భూములు అభివృద్ది చేసి, గత ప్రభుత్వం ఇచ్చిన హమీ మేరకు పనులు కొనసాగుతాయని చెప్పారు. అయితే అందులో అసైన్డ్ భూముల విషయంలో మాత్రం ఈ ప్రతిపాదన ఉండదని చెప్పారు. కాగా రాజధాని రైతులకు తిరిగి ఇస్తామని తాము చెప్పలేదని, మంత్రి పెద్దిరెడ్డి చెప్పిన వ్యాఖ్యలు కేవలం అసెన్డ్ భూములకు సంబంధించి మాత్రమే ప్రకటన చేశారని చెప్పారు.

రాజధానిపై జీఎన్ రావు ఇచ్చిన నివేదికపై బోత్స స్పందించారు. కమిటీ ఇచ్చిన నివేదికపై ఈనెల 27న చర్చిస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలోనే అమరావతిలోనే అసెంబ్లీ , గవర్నర్ కార్యాలయాలు ఉంటాయని , వీటితోపాటు అమరావతిని ఎడ్యుకేషనల్ హబ్‌గా మార్చాలని కమిటీ సూచించిందని చెప్పారు. దీనిపై రైతులు ఎలాంటీ ఆందోళనలు చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. రాష్ట్రంలో మిగతా చోట్ల అభివృద్ధి చేయనవసరం లేదా ? అని ప్రశ్నించారు. కొందరు రైతులను రెచ్చగొడుతున్నారని బొత్స మండిపడ్డారు.












Click it and Unblock the Notifications