‘లోకేష్ కోసమే-దసపల్లాలో రూ. 1500కోట్ల స్కాం’
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ సర్కారు, తెలుగుదేశం పార్టీ నేత నారా లోకేష్‌పై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత గుడివాడ అమర్నాథ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు.
విశాఖ దసపల్లా హిల్స్‌లో రూ. 1500కోట్ల కుంభకోణం జరుగుతోందని ఆరోపించారు. 18ఎకరాల ప్రభుత్వ భూమిని ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేష్, ఆయన బినామీలు దోచుకోవడానికి రంగం సిద్ధమైందని విమర్శించారు. ప్రభుత్వ భూమని అప్పటి కలెక్టర్ యువరాజ్ గెజిట్ లో నోటిఫై చేశారని ఆయన గుర్తు చేశారు.

ఈ క్రమంలోనే కలెక్టర్ యువరాజ్‌ను బదిలీ చేశారని ఆయన ఆరోపించారు. నిజాయితీగా పని చేస్తున్న కలెక్టర్లను బదిలీలు, సస్పెన్లు చేస్తున్నారని మండిపడ్డారు. మరోవైపు ప్రభుత్వానికి కొమ్ముకాసేవారికి ప్రమోషన్లు ఇస్తున్నారని ధ్వజమెత్తారు.
విశాఖ నడిబొడ్డున రూ. వందల కోట్ల విలువైన భూమిని దోచుకుంటున్నారని అమర్నాథ్ ఆరోపించారు. ఈ విషయంపై ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేస్తున్నామని అాన్నారు. ఆ భూమిని కాపాడేందుకు తాము పోరాటం కొనసాగిస్తామని అమర్నాథ్ అన్నారు.












Click it and Unblock the Notifications