15 నుంచి అమెజాన్ ప్రైమ్ డే సేల్... ఆఫర్లు ఇవే!

ఈనెల 15వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ డే సేల్ ప్రారంభం కాబోతోంది. కేవలం రెండురోజులు మాత్రమే ఉంటుంది. కొత్త ఫోన్ లేదంటే కొత్త గ్యాడ్జెట్ కొనాలని ఆలోచిస్తున్నట్లైతే లిస్టు తయారుచేసుకోవడం మంచిది. వన్‌ప్లస్, శాంసంగ్, యాపిల్ కంపెనీల స్మార్ట్‌ఫోన్లను అతి తక్కువ ధరకే కొనుగోలు చేయొచ్చు. Tecno Camon 20 Pro 5G, Motorola Razr 40 Ultra 5G, Samsung Galaxy M34 5G,iQOO Neo 7 Pro 5G, Realme Narzo 60 Series 5G, OnePlus Nord 3 5G ఫోన్లు ఆఫర్ లో ఉన్నాయి.

ఏ ఫోన్ ఎంత ధరకు అమ్ముడవుతుంది? ఏ ధరకు అందుబాటులో ఉంచనుంది అనే విషయాలను అమెజాన్ ఇంతవరకు వెల్లడించలేదు. సేల్ ప్రారంభమయ్యేరోజే కంపెనీ ఈ వివరాలను ఉంచుతుందని తెలుస్తోంది. ప్రైమ్ డే సేల్ 2023లో అత్యధికంగా అమ్ముడవుతున్న ఫోన్‌లపై 40% వరకు తగ్గింపును పొందొచ్చని అమెజాన్ ఇప్పటికే స్పష్టం చేసింది. మొబైల్ యాక్సెసరీస్ పై సైతం ఆఫర్లు ఉన్నాయి. పిట్రాన్ జెన్ బడ్స్ ఈవీఓ X1 రూ.3,999గా ఉంది. దీన్ని ఆఫర్ లో కేవలం రూ.1,299కే పొందొచ్చు. ఇది క్వాడ్ మైక్, ట్రూటాక్ ఈఎన్ సీని కలిగి ఉంది.

amazon

వినియోగదారులు OnePlus Nord Buds 2rని రూ. 2,199కి కొనుగోలు చేయొచ్చు. రూ.4,999కి బదులుగా కేవలం రూ.1,199కే గోవో గో బడ్స్‌ను పొందొచ్చు. ఇది 52 గంటల ప్లేటైమ్‌తో వస్తుంది. రెడ్‌మి బడ్స్ 4 యాక్టివ్‌ని రూ. 2,999కి బదులుగా కేవలం రూ.1,399కి కొనుగోలు చేయొచ్చు. గరిష్టంగా 30 గంటల బ్యాటరీ లైఫ్‌తో వస్తుంది. Mivi A850 Galaxy Blackని రూ. 4,999కి బదులుగా కేవలం రూ. 1,299కి కొనొచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+