ఏపీలో ఈ మూడు వ్యవస్థలూ కుమ్మక్కు: అంబటి రాంబాబు

స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో తెలుగుదేశం ప్రభుత్వం, పోలీసులు, ఎన్నికల కమిషన్ కుమ్మక్కై రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. సక్రమంగా నామినేషన్లు వేయని పరిస్థితిని కల్పించిందని ఆరోపించారు.

గుంటూరులోని తన క్యాంప్ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కూటమి ప్రభుత్వ అరాచకాలు, పోలీసుల చ‌ర్య‌ల‌ను ఎండగట్టారు. ఎన్నికల ప్రక్రియలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని, నామినేషన్లు వేసే అభ్యర్థులకు రక్షణ కల్పించాలని స్పష్టం చేసినప్పటికీ.. రాష్ట్రంలో ఎక్కడా ఆ పరిస్థితులు లేవని అన్నారు. రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్‌ చంద్రబాబు చేతిలో కీలుబొమ్మలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

Ambati Rambabu Accuses TDP-Police-SEC Collusion Undermining Democracy AP Local Body Election Tactics

పోలీసుల సమక్షంలోనే ప్రతిపక్ష అభ్యర్థుల నామినేషన్ పత్రాలను చించివేస్తూ ఏకపక్షంగా ఏకగ్రీవాలు చేసుకుంటున్నారని అంబటి రాంబాబు విమర్శించారు. రాష్ట్రంలో జరుగుతున్న ఈ అరాచకాలను, దౌర్జన్యాలను ప్రజలందరూ గమనిస్తున్నారని, స్దానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారని ధీమా వ్యక్తం చేశారు. గుంటూరు మేయర్ పదవికి పోటీ చేస్తోన్న శ్రీదేవి, కార్పొరేటర్ అభ్యర్థులను గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఆర్ణబ్ తుఫాన్.. కాకినాడ- గోపాల్ పూర్ మధ్య తీరం దాటే ఛాన్స్ : కంట్రోల్ రూమ్ ఏర్పాటు
ఆర్ణబ్ తుఫాన్.. కాకినాడ- గోపాల్ పూర్ మధ్య తీరం దాటే ఛాన్స్ : కంట్రోల్ రూమ్ ఏర్పాటు

వైసీపీ నాయకులను అకారణంగా గృహనిర్బంధం చేయడం ఈ ప్రభుత్వ అప్రజాస్వామిక విధానానికి నిదర్శనమని ఆయన ధ్వజమెత్తారు. మాజీ మంత్రి విడదల రజినిని పోలీసులు నెట్టివేసిన ఉదంతాన్ని ఆయన ప్రస్తావించారు. దీన్ని అత్యంత దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడు, నంబూరి శంకరరావు వంటి సీనియర్ నాయకులను బయటికి రానీయకుండా గృహనిర్బంధం చేశారని గుర్తు చేశారు.

వైఎస్ అంజలిరెడ్డి వెడ్డింగ్ కార్డ్: వెన్యూ విషయంలో నో కాంప్రమైజ్
వైఎస్ అంజలిరెడ్డి వెడ్డింగ్ కార్డ్: వెన్యూ విషయంలో నో కాంప్రమైజ్

చంద్రబాబు, లోకేష్‌ల రాజకీయ స్వార్థం కోసం పోలీసు వ్యవస్థను పూర్తిగా దుర్వినియోగం చేసి ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్నారని అంబటి ధ్వజమెత్తారు. చట్టాన్ని ఉల్లంఘిస్తూ అరాచకాలకు పాల్పడుతున్న ఐపీఎస్ అధికారులతో సహా మొత్తం 54 మంది పోలీసుల వివరాలను మేము సేకరించాం. సత్తెనపల్లి డీఎస్పీ హనుమంతరావు సహా తప్పు చేసిన ప్రతి ఒక్క పోలీసు అధికారిపై న్యాయస్థానాలను ఆశ్రయించి న్యాయపోరాటం చేస్తామని తేల్చి చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+