పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం వీడియో ఫేకా, ఒరిజనలా..!?

మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి వీడియో ధ్వంసం వీడియో వైలర్ అవుతోంది. రాష్ట్రంలో ఇప్పుడు ఇది చర్చకు కారణమైంది. ఎన్నికల సంఘం పిన్నెల్లి పై సీరియస్ అయింది. కేసు నమోదు అయింది. పోలీసులు పిన్నెల్లి కోసం గాలింపు చేస్తున్నారు. ఈ సమయంలోనే అసలు పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం చేస్తున్న వీడియో పైన వైసీపీ నేతలు ప్రశ్నలు సంధిస్తున్నారు. ఆ వీడియో ఎన్నికల సంఘం విడుదల చేయలేదని చెప్పటంతో..కొత్త అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఎలా లీక్ అయింది
పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఒక పోలింగ్‌ బూత్‌లో ఈవీఎం ధ్వంసంచేసిన వీడియో ఎవ‌రు లీక్ చేశారో తేల్చాలని మంత్రి అంబటి రాంబాబు డిమాండ్ చేసారు. ఎన్నిక‌ల క‌మిష‌న్ రిలీజ్ చేయాల్సిన వీడియో.. నారా లోకేష్ ట్విట్ట‌ర్‌లోకి ఎలా వ‌చ్చింద‌ని ప్రశ్నించారు. ఇది ఫేకా..ఒరిజనలా తేల్చాలని కోరారు. ఎన్నికల సంఘం తాము ఈ వీడియో విడుదల చేయలేదని చెప్పటం ద్వారా..ఈ వీడియో టీడీపీ నేతల వద్దకు ఎలా వచ్చిందో చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.ఆ వీడియో ఎక్కడి నుంచి రిలీజ్‌ అయిందో అర్థం కావడం లేదని అనుమానం వ్య‌క్తం చేశారు. ఈసీ నుంచి బ‌య‌ట‌కు రావాల్సిన వీడియో లోకేష్ ట్విట్ట‌ర్‌లోకి ఎలా చేరిందని ప్ర‌శ్నించారు.

Ambati Rambabu asks is Pinnelli EVM Damage video is original or not

టీడీపీకి ఎలా వెళ్లింది
పోలింగ్ బూత్‌లోని వీడియోను కలెక్టర్ అయినా రిలీజ్‌ చేయాలి లేదా ఎలక్షన్‌ కమిషన్‌కు సంబంధించిన వారైనా రిలీజ్‌ చేయాల‌న్నారు. వీరెవరూ కాకుండా ఇది డైరెక్ట్‌గా తెలుగుదేశం అధినేత కొడుకైన లోకేశ్‌ ట్విట్టర్‌లోకి ఎలా వెళ్లింది? అని ప్రశ్నించారు. అంటే ఇక్కడ ఏదో కుమ్మక్కు జరిగిందని స్పష్టంగా అర్థమవుతోందన్నారు. అధికారులు, ఎన్నికల కమిషన్‌లో ఉన్న అధికారులు, తెలుగుదేశం పార్టీ వారు కలిసి కుట్ర చేస్తున్నారనే అనుమానం కలుగుతుంద‌న్నారు. ఒక వేళ అది నిజంగా జరిగి ఉంటే, సంబంధిత అధికారులు విడుదల చేసి ఉంటే చట్టం తన పని తాను చేసుకొనేదన్నారు. ఇప్పుడు జరిగింది చూస్తుంటే ఇది ఫేక్‌ అనిపిస్తోందని అంబటి రాంబాబు అనుమానం వ్యక్తం చేసారు.

Ambati Rambabu asks is Pinnelli EVM Damage video is original or not

మేము ఫిర్యాదు చేసాం
ఎక్కడైతే బూత్‌ క్యాప్చరింగ్‌ జరిగిందో ఆ వీడియోస్‌ను ఎలక్షన్‌ కమిషన్‌ బయట పెట్టాలని డిమాండ్ చేసారు. ఒక చోట కాదు.. అనేక చోట్ల తాము ఫిర్యాదు కూడా చేశామని చెప్పారు. ఆ వీడియోలన్నీ రిలీజ్‌ చేయాలని కోరారు. ఎన్నికల్లో అక్రమాలపై తాము ఈసీకి అనేక రకాలుగా ముందస్తుగా ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. తుదకు ఆ అక్రమాలను అందరూ కళ్లారా చూడటంతో కొందరు అధికారులను సస్పెండ్‌ చేశారని, మరికొందరిని మార్చారని చెప్పారు. తద్వారా తప్పు జరిగిందనే భావన సర్వత్రా వ్యాపించిందని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+