జగన్, అదానీపై చంద్రబాబు హ్యాండ్సప్ అందుకే- రీజన్ చెప్పిన అంబటి ..!
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో కుదిరిన అదానీ-సెకీ ఒప్పందంపై నిన్న సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. జగన్ ను అరెస్టు చేసేందుకు అవకాశం వచ్చినా చేయలేదని, అదానీ ఒప్పందంపై అమెరికా కోర్టు తేల్చకుండా తామేమీ చేయలేమంటూ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేత అంబటి రాంబాబు ఇవాళ కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు వెనక్కి తగ్గడంపై సెటైర్లు వేశారు.
జగన్ పై చర్య తీసుకోవడానికి సెకీ ఒప్పందం లడ్డూలా దొరికిందంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై అంబటి ఘాటుగా స్పందించారు. లడ్డూలా దొరికితే తినకుండా ఉంటారా అని చంద్రబాబును ప్రశ్నించారు. ఏమీ చేయలేమని తెలిశాకే సెకీ ఒప్పందంపై చంద్రబాబు మౌనంగా ఉన్నారని ఆయన తేల్చిచెప్పేశారు. మరోవైపు అదానీ మీద యాక్షన్ తీసుకోనని కూడా చంద్రబాబు చెప్పేస్తున్నారని అంబటి ఆక్షేపించారు. అక్కడ తేలేవరకూ ఇక్కడ యాక్షన్ తీసుకోరంట అన్నారు. అసలు ఈ ఒప్పందాల్లో ఏమీ దొరక్కపోవడంతోనే చంద్రబాబు చర్యలు తీసుకోలేకపోతున్నారన్నారు.

మరోవైపు కక్షసాధింపు రాజకీయాలపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకూ అంబటి కౌంటర్ ఇచ్చారు. వైసీపీ ఆఫీసులకు మొత్తం నోటీసులు ఇచ్చి మంగళగిరిలో ఆఫీసును కూల్చేశారని, ఇది కక్షసాధింపు కాదా, మేం నమ్మాలా అని ప్రశ్నించారు. విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహాన్ని పెడితే కూటమి రాగానే లైట్లన్నీ ఆర్పేసి విధ్వంసం చేశారన్నారు. ఆరు నెలల్లో చేసింది కక్షసాధింపులేగా అన్నారు. అది తప్ప అభివృద్ధి లేదు, సంక్షేమం లేదన్నారు.
హత్యలు, అఘాయిత్యాలు, ఆస్తుల ధ్వంసం చేసి వైసీపీ కార్యకర్తల్ని గ్రామాల నుంచి తరిమేశారని, ఇదంతా కక్షసాధింపు కాదా
అని అంబటి ప్రశ్నించారరు. పల్నాడు, రాయలసీమలో కొందరు వేరే ప్రాంతాలకు వెళ్లి నివసిస్తున్నారని గుర్తుచేశారు.
ఐపీఎస్ లపై చంద్రబాబు చేసింది కక్షసాధింపు కాదా అని అంబటి అడిగారు. సస్పెండ్ కాని వారికీ పోస్టింగ్ లు ఇవ్వలేదని,
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు గత ప్రభుత్వంలో పోస్టులు పెట్టారని ఇప్పుడు వేధిస్తున్నారని, ఇవన్నీ కక్షసాధింపేనని గుర్తుచేశారు.












Click it and Unblock the Notifications