కలెక్టర్ పట్టుకున్న రేషన్ బియ్యాన్నే పవన్ కల్యాణ్ సీజ్ చేశారా..?
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భారీ ఎత్తున రేషన్ బియ్యం అక్రమ రవాణా సాగుతుందని విమర్శలు వినిపించాయి. దీనిపై గతంలో కూడా పవన్ కల్యాణ్ విమర్శలు చేశారు. ఇటువంటి తరుణంలో డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కల్యాణ్ తొలిసారి కాకినాడ పోర్టును సందర్శించారు. తనని ఇక్కడకు రాకుండా అడ్డుకోవాలని స్థానిక నేతలు చూశారని పవన్ కల్యాణ్ ఆరోపించారు.
నిన్న కాకినాడ పోర్టుకు వెళ్లిన పవన్, అక్కడ రేషన్ బియ్యం అక్రమ రవాణాపై తనదైనశైలిలో స్పందించారు. సంబంధిత అధికారులతో ,పాటు టీడీపీ ఎమ్మెల్యే కొండబాబు తీరుపై కూడా పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా చేస్తోన్న షిప్‌ను సీజ్ చేయాలని పవన్ కల్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. అయితే దీనిపై వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు.

ఈ శనివారం సాయంత్రం గుంటూరులోని పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి అంబటి మీడియాతో మాట్లాడుతూ.. అప్పటికే కలెక్టర్ పట్టుకున్న రేషన్ బియ్యాన్ని చూడటానికి పవన్ కళ్యాణ్ సాహసోపేతంగా వెళ్లారని ఆయన ఎద్దేవా చేశారు. అధికారులు తనను అడ్డుకున్నారని.. తీరా ఒడ్డుకు వచ్చిన తర్వాత విచిత్రమైన ఆరోపణలు చేశారని విమర్శించారు. అంతేకాదు రేషన్ బియ్యం అక్రమ రవాణాను అరికడతామని చెప్పిన మంత్రి నాదెండ్ల మనోహర్ దీనికి బాధ్యత వహిస్తారా? అని అంబటి రాంబాబు ప్రశ్నించారు. కూటమి నేతల సహకారంతోనే ఈ స్కామ్ జరుగుతుందని అంబటి రాంబాబు ఆరోపించారు. పవన్ కల్యాణ్ చెప్పే డైలాగులకు తగ్గట్లే ఆయనకు లెక్కలేనంత తిక్క ఉందని అంబటి రాంబాబు సెటైర్లు వేశారు.












Click it and Unblock the Notifications