సిఎం కిరణ్ వల్లే: బాబు విభజన వాదన్న అంబటి

 Ambati Rambabu
హైదరాబాద్: ముఖ్యమంత్రి తన పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ మొహాన కొట్టి ఉంటే రాష్ట్రంలో ప్రస్తుతం ఈ పరిస్థితి నెలకొని ఉండేది కాదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అంబటి రాంబాబు అన్నారు. కాంగ్రెస్ హైకమాండ్ డైరెక్షన్‌లోనే కిరణ్ కుమార్ రెడ్డి నడుస్తున్నారని ఆయన చెప్పారు. సోమవారం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

విభజనవాదంతో కాంగ్రెస్, సమైక్యవాదంతో సిఎం కిరణ్ డ్రామాలాడుతున్నారని అన్నారు. ఎక్కువ మంది జాతీయ నేతలు విభజనను వ్యతిరేకిస్తున్నారని అంబటి తెలిపారు. ఢిల్లీ అఖిలపక్ష సమావేశంలో చిన్న రాష్ట్రాలకు మద్దతిచ్చే భారతీయ జనతా పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ లాంటి జాతీయ పార్టీలు బిల్లును వ్యతిరేకిస్తున్నాయని అంబటి చెప్పారు.

దేశ వ్యాప్తంగా తెలంగాణ బిల్లును వ్యతిరేకించడానికి కృషి చేసిన ఏకైక పార్టీ తమదేనని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విభజనకు వ్యతిరేకం కాదని అంబటి తెలిపారు. విభజనకు అనుకూలంగా మాట్లాడుతున్న చంద్రబాబును సమైక్యవాదులు గమనించాలని అన్నారు. అందరితో మాట్లాడిన తర్వాతే రాష్ట్రాన్ని విభజించాలంటున్న చంద్రబాబు, తన సొంత పార్టీ నేతలనే ఒక్కతాటిపైకి తేలేకపోతున్నాడని విమర్శించారు. తమ పార్టీ ప్రభంజనాన్ని తట్టుకోలేక బిజెపితో చంద్రబాబు పొత్తు పెట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంటుందని, తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో అధికారంలోకి రాగానే విభజన వాద అనేదే లేకుండా చేస్తామని తెలిపారు. దొంగ సమైక్యవాదులతో కలిసి వెళ్లబోమని తేల్చి చెప్పారు. ఆదాల ప్రభాకర్ రెడ్డితో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో ఒప్పందం కుదుర్చుకుందని ఓ బఫూన్ ఆరోపించాడని, అతని మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని తెలిపాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+