కొత్త పార్టీకి సిఎం కలెక్షన్లు: అంబటి, లగడపాటిపై ఫైర్

సమైక్యవాదం పేరుతో కొత్త పార్టీ పెట్టి తర్వాత కాంగ్రెస్‌లో కలపాలన్నదే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యూహమని అన్నారు. సిఎం కిరణ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్‌వి నకిలీ సమైక్య ఉద్యమాలని అంబటి రాంబాబు ఆరోపించారు.
లగడపాటికి ఒక న్యాయం.. సామాన్యుడికొక న్యాయం అనే విధంగా ప్రభుత్వ వైఖరి ఉందని ఆరోపించారు. లగడపాటికి చెందిన ల్యాంకో గ్రూపు రూ. 40వేల కోట్ల అప్పుల్లో ఉందని, ల్యాంకోకు నెలకు రూ. 570 కోట్ల నష్టాలు వస్తున్నాయని తెలిపారు. ల్యాంకో ఇన్‌ఫ్రాకు రూ. 8వేల కోట్ల రుణాలను బ్యాంకులు రీషెడ్యూలు చేశాయని, తిరిగి రూ. 3,500 కోట్ల రుణాలు కొత్త ఇచ్చాయని వెల్లడించారు. ఇవన్ని కొత్త పార్టీకి పెట్టుబడులా అని అంబటి అనుమానం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్‌కు నిజమైన దత్తపుత్రుడు లగడపాటి కాబట్టే ఆయనకు ఉదారంగా రుణాలు ఇప్పిస్తోందని అన్నారు. కిరణ్ పార్టీ పెడితే ఓట్లు, సీట్లు రెండూ రావని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి పదవిని వదిలేస్తే కిరణ్ కుమార్ రెడ్డిని ఎవరూ గుర్తుపట్టరని అంబటి అన్నారు. కాగా తెలంగాణ ముసాయిదా బిల్లు వచ్చినా రాకపోయినా అసెంబ్లీలో సమైక్యరాష్ట్ర తీర్మానం చేయాలని మరో నేత, ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications