హోదాపై మెడలు వంచుతారా?: ఉండవల్లి ఆశీస్సు! జగన్ ముద్దులు (పిక్చర్స్)

గుంటూరు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి నిరవధిక దీక్ష గురువారం నాడు రెండో రోజుకు చేరుకుంది. ఏపీకి ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ జగన్ గుంటూరు జిల్లా నల్లపాడు వద్ద దీక్ష చేస్తున్నారు.

జగన్ దీక్షకు పలువురు మద్దతు పలుకుతున్నారు. జగన్ కాంగ్రెస్ పార్టీని వీడి వచ్చాక.. వైయస్ సన్నిహితుడైన ఉండవల్లి అరుణ్ కుమార్... జగన్ పైన నిప్పులు చెరిగిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి ఉండవల్లి కూడా జగన్ దీక్ష సఫలం కావాలని ఆకాంక్షించారు. లాయర్లు మద్దతు పలికారు.

వైయస్ జగన్ దీక్ష ఫలితం సాధిస్తుందని వైసిపికి చెందిన అంబటి రాంబాబు ఆకాంక్షించారు. జగన్ తన దీక్ష ద్వారా చంద్రబాబు, కేంద్రం మెడలు వంచుతారని, తద్వారా ప్రత్యేక హోదా సాధిస్తారని చెబుతున్నారు. మరోవైపు, సోషల్ మీడియాలో జగన్ దీక్ష చర్చకు దారి తీస్తోంది.

కాగా, వైయస్ జగన్ దీక్షలో రెండో రోజు పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, నేతలు పాల్గొన్నారు. రోజా, వాసిరెడ్డి పద్మ, బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు తదితరులు జగన్ దీక్ష ప్రాంగణంలో ఆయన వెంటే కూర్చున్నారు.

జగన్ వద్ద రోజా, వాసిరెడ్డి

జగన్ వద్ద రోజా, వాసిరెడ్డి

ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ గుంటూరు జిల్లా నల్లపాడు వద్ద జగన్ నిరవధిక దీక్ష చేస్తున్నారు. దీక్షా ప్రాంగణంలో రోజా, వాసిరెడ్డి పద్మ తదితరులు.

చిన్నారికి జగన్ ముద్దు

చిన్నారికి జగన్ ముద్దు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి గురువారం నాడు దీక్షా ప్రాంగణంలో ఓ చిన్నారికి ముద్దు పెడుతున్న దృశ్యం.

చిన్నారితో ఆడుకుంటూ జగన్

చిన్నారితో ఆడుకుంటూ జగన్

వైయస్ జగన్ గురువారం దీక్షా ప్రాంగణలో ఓ చిన్నారితో ఆడుకుంటూ.. ఆనందిస్తున్న దృశ్యం. జగన్ నిరవధిక దీక్ష రెండో రోజుకు చేరుకుంది.

జగన్‌కు తిలకం

జగన్‌కు తిలకం

ప్రత్యేక హోదా కోసం నిరవధిక దీక్ష చేస్తున్న వైయస్ జగన్మోహన్ రెడ్డికి తిలకం దిద్దుతున్న పార్టీకి చెందిన ఓ మహిళా కార్యకర్త.

జగన్ నవ్వులు

జగన్ నవ్వులు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి గురువారం నాడు దీక్షా ప్రాంగణంలో నవ్వులు చిందిస్తూ...

జగన్ అభివాదం

జగన్ అభివాదం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పార్లమెంటులో హామీ ఇచ్చిన మేరకు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ దీక్ష చేస్తున్న జగన్.. తనకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన వారికి అభివాదం చేస్తూ...

లక్ష్మీ పార్వతికి సంఘీభావం

లక్ష్మీ పార్వతికి సంఘీభావం

దీక్షా శిబిరం వద్ద వైయస్ రాజశేఖర రెడ్డి పైన వేసిన చిన్న పుస్తకాన్ని పరిశీలిస్తున్న జగన్. పక్కన నవ్వుతూ లక్ష్మీ పార్వతి.

జగన్ వద్ద అంబటి

జగన్ వద్ద అంబటి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పార్లమెంటులో హామీ ఇచ్చిన మేరకు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ దీక్ష చేస్తున్న జగన్ పక్కన అంబటి రాంబాబు, లక్ష్మీ పార్వతి.

జగన్‌కు మద్దతు

జగన్‌కు మద్దతు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పార్లమెంటులో హామీ ఇచ్చిన మేరకు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ దీక్ష చేస్తున్న జగన్‌కు మద్దతుగా...

న్యాయవాదుల మద్దతు

న్యాయవాదుల మద్దతు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పార్లమెంటులో హామీ ఇచ్చిన మేరకు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ దీక్ష చేస్తున్న జగన్‌కు న్యాయవాదుల మద్దతు.

వైద్య పరీక్షలు

వైద్య పరీక్షలు

ప్రత్యేక హోదా కోసమై జగన్ నిరవధిక దీక్ష గురువారం రెండో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆయనకు వైద్య పరీక్షలు చేస్తున్న దృశ్యం.

వైద్య పరీక్షలు

వైద్య పరీక్షలు

ప్రత్యేక హోదా కోసమై జగన్ నిరవధిక దీక్ష గురువారం రెండో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆయనకు వైద్య పరీక్షలు చేస్తున్న దృశ్యం.

వైద్య పరీక్షలు

వైద్య పరీక్షలు

ప్రత్యేక హోదా కోసమై జగన్ నిరవధిక దీక్ష గురువారం రెండో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆయనకు వైద్య పరీక్షలు చేస్తున్న దృశ్యం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+