అదే జరిగితే నేను నైతికంగా ఓడినట్లే - అంబటి..!!

ఏపీలో ఎన్నికల రాజకీయం హోరా హోరీగా మారుతోంది. కీలక నియోజకవర్గాల్లో సీనియర్లు గెలుపు పైన ధీమా వ్యక్తం చేస్తున్నారు. కూటమి వర్సస్ వైసీపీ అన్నట్లుగా ఎన్నికల యుద్దం కొనసాగుతోంది. వామపక్షా లతో కలిసి కాంగ్రెస్ కూటమి బరిలోకి దిగింది. టీడీపీ, వైసీపీ నుంచి ముఖ్య నేతలు పోటీ చేస్తున్న నియోజకవర్గాల పైన ఆసక్తి నెలకొంది. సత్తెనపల్లి నుంచి పోటీ చేస్తున్న మంత్రి అంబటి రాంబాబ తన గెలుపు పైన కీలక వ్యాఖ్యలు చేసారు.

అంబటి వర్సస్ కన్నా
అంబటి రాంబాబు సత్తెనపల్లి నుంచి రెండో సారి పోటీ చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో నాటి టీడీపీ అభ్యర్ది కోడెల శివప్రసాద్ పైన 20,876 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేసిన యర్రం వెంకటేశ్వర రెడ్డికి 9,279 ఓట్లు పోలయ్యాయి. ఇప్పుడు మరోసారి వైసీపీ నుంచి అంబటి పోటీ చేస్తుండగా..టీడీపీ నుంచి సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ పోటీ చేస్తున్నారు. ఇద్దరి మధ్య కొంత కాలంగా హోరా హోరీ రాజకీయం కొనసాగుతోంది. ఇద్దరు నేతలు గెలుపు పైన ధీమా వ్యక్తం చేస్తున్నారు. తాజాగా సీఎం జగన్ బస్సు యాత్ర తరువాత వైసీపీకి అనుకూలంగా పరిస్థితులు మారాయని అంబటి మద్దతు దారులు చెబుతున్నారు.

Ambati Rambabu keycomments over his winning in Sattenapalli against Kanna Laxminarayana

గెలుపు పై ధీమాగా
సత్తెనపల్లిలో చంద్రబాబు నిర్వహించిన సభ సైతం సక్సెస్ అయింది. ఈ సారి గెలవాలనే లక్ష్యంతో కన్నా అడుగులు వేస్తున్నారు. సత్తెనపల్లి ఎన్నికల పైన మాట్లాడి మంత్రి అంబటి రాంబాబు జనసేనాని పవన్ ను టార్గెట్ చేసారు. పవన్ రాజకీయాలకు పనికి రాడని ఎద్దేవా చేశారు. పవన్ కల్యాణ్ డైలాగ్‌లు సినిమాల్లో వర్కౌట్ అవుతాయి కానీ రాజకీయాల్లో పని చేయవని అన్నారు. ఇక, తనకు ఎమ్మెల్యే టికెట్ దక్కదని గోబెల్స్ ప్రచారం జరిగిందని మండిపడ్డారు. తాను అసెంబ్లీకి వెళ్లకుండా టీడీపీ, జనసేన, బీజేపీ అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా తన విజయం ఖాయమని అంబటి ధీమా వ్యక్తం చేసారు.

నైతికంగా ఓడినట్లే
ఇదే సమయంలో..2019 ఎన్నికల్లో వచ్చిన మెజారిటీ కన్నా ఈ సారి ఒక్క ఓటు తగ్గినా తాను నైతికంగా ఓడినట్టేనని కీలక వ్యాఖ్యలు చేశారు. సత్తెనపల్లి నుండి అనిల్ కుమార్ యాదవ్‌కు అత్యధిక మెజార్టీ రావాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తుందని.. జగన్ రెండోసారి సీఎం అవ్వడం ఖాయమని చెప్పుకొచ్చారు. పల్నాడులో 2019 ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఎంపీ సీటును గెలుచుకుంది. ఈ సారి నర్సరావు పేట ఎంపీ సీటులోనూ లావు శ్రీక్రిష్ణ దేవరాయులు - అనిల్ కుమార్ యాదవ్ మధ్య గట్టి పోటీ నెలకొంది. ఇరు పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారిన పల్నాడులో ఎవరికి విజయం దక్కుతుందనేది రాజకీయంగా ఆసక్తిని పెంచుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+