హలో ఇండియా- ఇదీ ఏపీ పరిస్దితి..! జగన్ సంచలన ట్వీట్..!

ఏపీలో తాజాగా చోటు చేసుకుంటున్న లాకప్ డెత్ లు, ఇందులో పోలీసుల ప్రమేయం నేపథ్యంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ (YS Jagan) ఇవాళ ఓ సంచలన ట్వీట్ చేశారు. హలో ఇండియా!!! చట్ట పాలన స్థానంలో భయానక పాలన ఆవహిస్తోందంటూ ఇందులో పేర్కొన్నారు. పోలీసులంటే ప్రజలు అత్యంత భయపడే పరిస్థితికి ఆంధ్రప్రదేశ్ చేరుకుందా అని ప్రశ్నించారు.

పోలీసుల కస్టడీలో మరణించిన గాదె సాయికృష్ణ మృతదేహాన్ని రహస్యంగా దహనం చేశారన్న ఆరోపణలు, పోలీసు వేధింపుల గురించి సెల్ఫీ వీడియోలో ఆరోపించి క్రాంతి కుమార్ ఆత్మహత్య చేసుకోవడం, ఏపీలో జరుగుతున్న వరుస సంఘటనలు కేవలం విడివిడి విషాదాలు కావన్నారు. ఇవి టీడీపీ కూటమి ప్రభుత్వ 'రెడ్ బుక్' పాలనలో పెంచి పోషించిన ప్రమాదకరమైన సంస్కృతి ఫలితాలన్నారు. పోలీసులు భారత రాజ్యాంగం ప్రకారం పనిచేస్తున్నారా లేక చంద్రబాబు 'రెడ్ బుక్' ప్రకారం పనిచేస్తున్నారా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారని జగన్ తెలిపారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థకు న్యాయం కాకుండా 'భయం' ప్రధాన లక్షణంగా మారుతోందన్నారు.

YS Jagan Attacks AP Govt Over Rule of Fear Questions Police Conduct

'రెడ్ బుక్' ఆవిష్కరించిన రోజు నుంచే పోలీసు వేధింపుల ద్వారా రాజకీయ కక్షసాధింపును ప్రోత్సహించడం వల్ల పోలీసులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునే అవకాశం ఉంటుందని, వ్యవస్థలు భ్రష్టుపట్టిపోతాయని, పోలీసు బలగాల్లోని కొన్ని వర్గాలు చట్టాలు, నిబంధనలు, రాజ్యాంగ రక్షణలను అతిక్రమించి వ్యవహరించేలా ధైర్యం పొందుతాయని వైఎస్సార్సీపీ హెచ్చరించిందన్నారు. ఆ హెచ్చరిక ఇప్పుడు బాధాకరమైన వాస్తవంగా మారిందన్నారు. మొదట రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకున్నారన్నారు. ఆ తర్వాత సోషల్ మీడియా కార్యకర్తలు, ఆపై పాత్రికేయులు, మేధావులు, భిన్నాభిప్రాయం వ్యక్తం చేసేవారు బాధితులుగా మారారన్నారు.

SIR తో బూత్ కు 50 ఓట్ల తొలగింపు? నేతలకు జగన్ బిగ్ అలర్ట్..!
SIR తో బూత్ కు 50 ఓట్ల తొలగింపు? నేతలకు జగన్ బిగ్ అలర్ట్..!

రాజకీయ వేధింపులుగా మొదలైన ఈ ప్రక్రియ, ఇప్పుడు అదుపులేని పోలీసు చర్యల ప్రమాదకరమైన అలవాటుగా మారిందన్నారు. దీనివల్ల సామాన్య ప్రజలు కూడా బెదిరింపులు, వేధింపులు, అధికార దుర్వినియోగానికి గురవుతున్నారన్నారు. సాయికృష్ణ ఉదంతం ఆంధ్రప్రదేశ్ ప్రజల మనస్సాక్షిని కలచివేసింది. శోకసంద్రంలో ఉన్న తల్లి ఇంకా సమాధానాల కోసం వేడుకుంటోంది; కనీసం తన కుమారుడి మృతదేహాన్ని చూపించలేకపోతే, అతని అస్థికలనైనా అప్పగించాలని అధికారులను కోరుతోందన్నారు. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడైనా ఇంతటి భయానక పరిస్థితి తలెత్తిందా? అని ప్రశ్నించారు.

క్రాంతి కుమార్ ఉదంతం కూడా అంతే ఆందోళనకరమైనదన్నారు. ఆత్మహత్య అనే తీవ్ర నిర్ణయం తీసుకునే ముందు, పోలీసులు నిరంతరం వేధించారని ఆయన బహిరంగంగా ఆరోపించారని, తునిలో తిరుపతమ్మ అనే మహిళ ఆత్మహత్యకు ముందు పోలీసు వేధింపుల గురించి సెల్ఫీ వీడియోలో ఆరోపించారని గుర్తుచేశారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన కళావతి పోలీసు వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకున్నారన్నారు. కర్నూలు జిల్లాలో విచారణ సమయంలో పోలీసుల చిత్రహింసల వల్ల దళిత మహిళ గంగమ్మ మరణించారని ఆరోపణలు ఉన్నాయన్నారు. ఆమె మరణంపై న్యాయ విచారణ జరగాలని కుటుంబ సభ్యులు కోరుతుండగా, మృతదేహాన్ని రహస్యంగా ఖననం చేశారన్నారు. ఇటువంటి సంఘటనలు పదేపదే జరిగినప్పుడు, అవి కేవలం యాదృచ్ఛిక ఘటనలుగా మిగిలిపోకుండా లోతైన, ఆందోళనకరమైన సరళిని ప్రతిబింబించడం ప్రారంభిస్తాయన్నారు.

YS Jagan Attacks AP Govt Over Rule of Fear Questions Police Conduct
కూటమి మెడకు సాయికృష్ణ లాకప్ డెత్..! హైకోర్టు డెడ్ లైన్-ఏం చెప్పబోతున్నారు ?
కూటమి మెడకు సాయికృష్ణ లాకప్ డెత్..! హైకోర్టు డెడ్ లైన్-ఏం చెప్పబోతున్నారు ?

అదే సమయంలో, పోలీసుల అరాచకాలు నిత్యకృత్యంగా మారాయి. కోడి లేదా మేకను కోయడం వంటి చిన్నపాటి ఆరోపణల విషయంలోనూ ప్రతిపక్ష కార్యకర్తలను బహిరంగంగా అవమానించడం, వారిని వీధుల్లో ఊరేగించడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. మోరల్ పోలీసింగ్ పేరుతో, అధికారులు తామే న్యాయమూర్తులుగా, జ్యూరీగా, శిక్ష అమలు చేసేవారిగా వ్యవహరిస్తున్నారన్నారు. . కానీ వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఫిర్యాదులతో పోలీస్ స్టేషన్లకు వెళ్తే కేసులను విస్మరించడం లేదా పక్కన పెట్టడం జరుగుతోందన్నారు. ఈ స్పష్టమైన ద్వంద్వ ప్రమాణాలు పోలీస్ శాఖపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని తీవ్రంగా దెబ్బతీశాయన్నారు. జవాబుదారీతనం లోపించిన ఈ పరిస్థితికి డీజీపీ, హోం మంత్రి, సీఎం చంద్రబాబు బాధ్యత వహించక తప్పదన్నారు. ఏపీ ప్రజలకు 'రెడ్ బుక్' పాలన కాదన్నారు. అంబేద్కర్ రాజ్యాంగం ఆధారిత పాలన అవసరమన్నారు. పోలీసులు రాజకీయ ప్రతీకారానికి సాధనాలుగా పనిచేయడానికి కాదన్నారు. హక్కులను రక్షించడానికి, చట్టాన్ని నిలబెట్టడానికి మరియు న్యాయం చేకూర్చడానికి ఉన్నారన్నారు. న్యాయం స్థానంలో భయం, చట్టం స్థానంలో అధికారం చేరితే, ప్రజాస్వామ్యమే బలి అవుతుందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+