పుష్ప -2 ను అడ్డుకుంటే, వారికి జెలసీ : అంబటి సంచలనం..!!
పుష్ఫ-2 విడుదల పైన అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. వచ్చే నెల 5న పుష్ఫ -2 విడుదలకు సిద్దమవుతోంది. ఈ సమయంలో ఈ సినిమా పైన రాజకీయంగానూ చర్చ మొదలైంది. వైసీపీ ముఖ్య నేత అంబటి రాంబాబు పుష్ఫ -2 గురించి కీలక వ్యాఖ్యలు చేసారు. అల్లు అర్జున్ ఇంటర్నేషనల్ స్టార్ అని ప్రశంసించారు. అల్లు అర్జున్, జూ ఎన్టీఆర్ సినిమాలు అడ్డుకోలేరంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
అడ్డుకోగలరా
పుష్ఫ -2, జూనియర్ ఎన్టీఆర్ గురించి మాజీ మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. అల్లు అర్జున్ సినిమాను చూడకుండా ఆపే శక్తి ఎవరికీ లేదన్నారు. అల్లు అర్జున్ ఇప్పుడు ఇంటర్నే షనల్ హీరోగా అభివర్ణించారు. పుష్ఫ -2 అడ్డుకోవటం ఎవరి వల్లా కాదని తేల్చి చెప్పారు. గతంలో జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు అడ్డుకోవాలనుకున్నారని గుర్తు చేసారు. కానీ, ఏమైందని ప్రశ్నించారు. పుష్ఫ -2 కోసం అందరూ ఆసక్తిగా చూస్తున్నారని చెప్పుకొచ్చారు. అరచేతిని అడ్డు పెట్టుకొని సినిమా విజయాన్ని ఆపలేరని ..తాను సినిమా చూడటానికి సిద్దంగా ఉన్నానని చెప్పారు. తొలి పార్ట్ అద్బుతంగా ఉందని ప్రశంసించారు.

వారికి జెలసీ
కొందరికి పుష్ఫ -2 పై కొంత మందికి జెలసీగా ఉందని రాంబాబు వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్, అల్లు అర్జున్‌ను బహిష్కరించాలని ఎవరైనా అనుకుంటే అది అవివేకమని అంబటి రాంబాబు పేర్కొన్నారు. మంత్రి లోకేష్ చెబుతున్న రెడ్ బుక్ భవిష్యత్ లో అతనికి శాపంగా మారుతుందని వ్యాఖ్యానించారు. సోషల్‌మీడియాలో పోస్టులపై వైసీపీ కార్యకర్తలను అరెస్టు చేస్తున్నపుడు టీడీపీ కార్యకర్తలను ఎందుకు అరెస్టు చేయరని ప్రశ్నించారు. చంద్రబాబు నీతి వ్యాఖ్యలు చెబుతున్నారే కానీ, అసభ్యకరమైన పోస్టింగ్స్ పెట్టిన వారిపై ఫిర్యాదు చేసినా చర్యలు మాత్రం లేవని చెప్పారు.
వర్మ, పోసాని పై
ఇప్పటికే ఈ నెల 17,18,19 తేదీల్లో జగన్, ఆయన కుటుంబ సభ్యులతో పాటు మా కుటుంబ సభ్యులపైన టీడీపీ నాయకులు పెట్టిన పోస్టులపై వివిధ పోలీస్‌స్టేషన్‌లలో ఫిర్యాదు చేశామని రాంబాబు వెల్లడించారు. వెళ్ళి ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించినా, స్పష్టమైన సమాధానం మాకు రాలేదన్నారు. ఇప్పుడు స్పీకర్‌గా ఉన్న వ్యక్తి జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని గుర్తు చేసారు. పోలీసులు స్పందించకుంటే న్యాయస్థానాల్ని ఆశ్రయిస్తామని అంబటి స్పష్టం చేసారు.
డైరెక్టర్ రాంగోపాల్ వర్మపైన కూడా కేసులు పెట్టారన్నారు పోసాని మురళీకృష్ణ జగన్ అభిమాని అని చెప్పుకొచ్చారు. ఆయనపై కేసులు పెట్టి భయపెట్టొచ్చేమో కానీ, జగన్‌పై ఆయనకున్న ప్రేమను మాత్రం తొలగించలేరని రాంబాబు వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications