వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భోగి వేడుకల్లో స్టెప్పులతో హోరెత్తించిన మంత్రి అంబటి ..!!

|
Google Oneindia TeluguNews

ఏపీ మంత్రి అంబటి రాంబాబు స్టెప్పులతో సందడి చేసారు. తెలుగు రాష్ట్రాల్లో భోగి వేడుకలు మొదలయ్యాయి. ఉదయం నుంచే పలువురు భోగి మంటలతో సంబురాలు చేసుకుంటున్నారు. ప్రముఖులు భోగి శుభాకాంక్షలు చెబుతున్నారు. సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబు స్థానికులతో కలిసి భోగి వేడుకల్లో పాల్గొన్నారు. బంజారా స్టెప్పులతో అదరగొట్టారు. గత ఏడాది సత్తెనపల్లిలో అంబటి రాంబాబు సంక్రాంతి వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో జనసేనకు అంబటి టార్గెట్ గా మారారు. మంత్రి రాంబాబు జనసేనాని పవన్ ను కౌంటర్ చేస్తున్నారు.

ఇప్పుడు సంక్రాంతి సంబరాల్లో మంత్రి అంబటి రాజకీయాలను పక్కన పెట్టి.. స్థానికులతో కలిసి పండుగ జరుపుకుంటున్నారు. బంజారా డాన్స్ చేసారు. స్టెప్పులతో హోరెత్తించారు. మంత్రి స్టెప్పులు వేస్తున్న సమయంలో పాల్గొన్న యువత కేరింతలు కొడుతూ మద్దతు పలికారు. డప్పు కళాకారులు బంజారాలతో కలిసి భోగి మంటల చుట్టూ పాటలు పాడుతూ.. డాన్స్ లు చేస్తూ పండుగను ఆస్వాదించారు. వారితో అంబటి జత కలిసారు. అంబటి డాన్స్ చేస్తున్న సమయంలో యువత నుంచి మద్దతు లభించింది. మంత్రితో పాటుగా పలువురు డాన్స్ చేసారు.

Ambati Rambabu mass dance on the eve of Bhogi at Sattenapalli, goes viral in social media

భోగి సంబరాల్లో పాల్గొనటం సంతోషంగా ఉందని మంత్రి అంబటి పేర్కొన్నారు. ప్రజలకు తోడుగా జగనన్న సంక్షేమ పథకాలు ఉన్నాయన్నారు. అంబటి రాంబాబు భోగా మంటల చుట్టూ వేసిన స్టెప్పులు.. డాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన డాన్స్ పైన పెద్ద ఎత్తున కామెంట్స్ పోస్టు చేస్తున్నారు. అంబటి డాన్స్ ను పలువురు ప్రశంసిస్తూ సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ.. అంబటిని రాజకీయంగా ప్రతిపక్షాలు టార్గెట్ చేస్తున్న వేళ సత్తెనపల్లిలో రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది.

English summary
Minister Ambati Rambabu shook his leg on the eve of Bhogi at Sattenapalli, where the vidoe went viral.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X