అంబటి నోటి పారుదల శాఖామంత్రి; ఆయన తలకి రంగు వేయనిది అందుకేనట!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసి, విమర్శలు గుప్పిస్తున్న అంబటి రాంబాబు పై జనసేన నేతలు తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు. తాజాగా జనసేన నేత గాదె వెంకటేశ్వరరావు అంబటి రాంబాబును టార్గెట్ చేసి తీవ్ర విమర్శలు గుప్పించారు. అంబటి రాంబాబు పవన్ కళ్యాణ్ ను విమర్శిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు.

సత్తెనపల్లిలో మీడియాతో మాట్లాడిన జనసేన నేత గాదె వెంకటేశ్వరరావు అంబటి రాంబాబు పై తీవ్ర పదజాలంతో అసహనం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ గురించి కానీ, వారాహి యాత్ర గురించి కానీ విమర్శలు చేసే ఇకపై ఊరుకోబోమని ఆయన హెచ్చరికలు జారీ చేశారు. వచ్చే ఎన్నికల్లో అంబటి రాంబాబు పై సత్తెనపల్లిలో జనసేన పోటీ చేస్తుందని ఆయన తేల్చి చెప్పారు.

Ambati rambabu

అంబటి రాంబాబు నీటిపారుదల శాఖ మంత్రి కాదని ఆయన నోటి పారుదల శాఖ మంత్రి అంటూ విమర్శలు గుప్పించారు. రాష్ట్ర నీటిపారుదల శాఖకు మంత్రి అంబటి రాంబాబు న్యాయం చేయలేదని ఆయన మండిపడ్డారు. మంత్రిగా ఆయన చేసిందేమీ లేదన్నారు. వైసీపీలో సీనియర్ నేతగా కనిపించడం కోసమే ఆయన తన జుట్టు కు రంగు వేసుకోవడం లేదని అంబటి రాంబాబును ఎద్దేవా చేశారు జనసేన నేత గాదె వెంకటేశ్వరరావు.

Ambati rambabu

ఇదిలా ఉంటే వారాహి యాత్ర ప్రారంభమైన నాటినుండి అంబటి రాంబాబు పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేస్తున్నారు. అప్పుడప్పుడు వారాహిని నడపగలవు. పార్టీని నడపలేవు అంటూ పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తున్నారు అంబటి రాంబాబు .చెప్పులు పోయాయంట.. నాలుగు రోజులు వెతుక్కొని తిరిగి షూటింగ్ కు పోతాడు లే.. పట్టించుకోకండి అంటూ పవన్ కళ్యాణ్ పై సెటైర్లు వేశారు.

పవన్ మానసిక స్థితిసరిగా ఉండటం లేదని సెటైర్లు వేశారు.వారాహి వాహనం వెనుక అంబులెన్స్ ను ఏర్పాటు చేసి అందులో ఆయనకు మానసిక వైద్యాన్ని చేయడానికి మానసిక వైద్యుడిని అందుబాటులో ఉంచమని ఏపీ వైద్య శాఖను కోరుతున్నానని మంత్రి అంబటి వ్యాఖ్యలు చేశారు .ఇక పదే పదే పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తున్న అంబటి రాంబాబుకు జనసేన నేతలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇకపై మంత్రి అంబటి రాంబాబు నోరు అదుపులో పెట్టుకోవాలని సూచిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+