ఇటలీ దెయ్యంని తరిమికొట్టాలని చెప్పావుగా: బాబుపై అంబటి, టీడీపీకి డిపాజిట్లు రావని సర్వేలు..

అమరావతి: కాంగ్రెస్ పార్టీతో తెలుగుదేశం పార్టీ కలవడం దేనికి సంకేతమని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు గురువారం ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ టీడీపీ అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరిచారా అని ప్రశ్నించారు. గతంలో తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ అని విమర్శించిన చంద్రబాబు ఇప్పుడు ఏమంటారని ప్రశ్నించారు.

కేవలం అసెంబ్లీ సీట్ల కోసం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో కలిసిన చరిత్ర చంద్రబాబుది అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు దారుణమైన రాజకీయాలు చేస్తోంది మంత్రి నారా లోకేష్ కోసమేనని ఎద్దేవా చేశారు. తమ పార్టీ అధినేత వైయస్ జగన్ పైన విశాఖపట్నం విమానాశ్రయంలో దాడి జరిగితే కనీసం ఫోన్ చేయలేదని చెప్పారు.

ఇటలీ దెయ్యం సోనియా గాంధీని తరిమికొట్టాలని చెప్పింది చంద్రబాబే

ఇటలీ దెయ్యం సోనియా గాంధీని తరిమికొట్టాలని చెప్పింది చంద్రబాబే

ఏపీకి కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసిందని అంబటి రాంబాబు అన్నారు. రాజకీయ ఎత్తుగడ కోసం కాంగ్రెస్ ఏపీని రెండుగా చీల్చిందని మండిపడ్డారు. ఇటలీ దెయ్యం సోనియా గాంధీని తరిమి కొట్టాలని చెప్పింది చంద్రబాబు నాయుడేనని గుర్తు చేశారు.

Recommended Video

    Telangana Elections 2018 : రాహుల్ ఇంటికి చంద్రబాబు
    రాహుల్ గాంధీని పప్పూ అన్నారు

    రాహుల్ గాంధీని పప్పూ అన్నారు

    ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీని పప్పు అన్నది కూడా చంద్రబాబే అని అంబటి రాంబాబు గుర్తు చేశారు. కుట్ర, వెన్నుపోటు రాజకీయాలు చంద్రబాబు నైజమని ఆరోపించారు. ఎన్టీఆర్‌ను దేవుడు అని పొగిడిన చంద్రబాబు, ఆ తర్వాత ఆయనకు వెన్నుపోటు పొడిచి ఆయన కూర్చీ లాక్కున్నారన్నారు.

     మోడీని తిట్టి, ఆయనతోనే కలిశారు

    మోడీని తిట్టి, ఆయనతోనే కలిశారు

    గతంలో ప్రధాని నరేంద్ర మోడీని విమర్శించి 2014లో మళ్లీ ఆయనతోనే జత కట్టారని అంబటి రాంబాబు గుర్తు చేశారు. ప్రత్యేక హోదా అవసరం లేదని చెప్పిన చంద్రబాబు ఆ తర్వాత యూటర్న్ తీసుకొని మళ్లీ హోదా కావాలని డిమాండ్ చేయడం విడ్డూరమన్నారు. అసలు చంద్రబాబుది నాలుకనా లేక తాటిమట్టా అని ప్రశ్నించారు.

    టీడీపీకి డిపాజిట్ దక్కదని చెబుతున్న సర్వేలు

    టీడీపీకి డిపాజిట్ దక్కదని చెబుతున్న సర్వేలు

    చంద్రబాబును నమ్మి బాగుపడ్డవారు ఎవరూ లేరని అంబటి రాంబాబు అన్నారు. ఆర్థిక సంబంధాలే తప్ప మానవ సంబంధాలు లేని వ్యక్తి చంద్రబాబు అన్నారు. అసలు చంద్రబాబు ఎప్పుడైనా, ఏ ఎన్నికల్లో అయినా ఒంటరిగా పోటీ చేశారా అని నిలదీశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి డిపాజిట్ కూడా దక్కదని సర్వేలు చెబుతున్నాయన్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+