చంద్రబాబు చేసిన తప్పిదమే కారణం - మంత్రి అంబటి..!!
మంత్రి అంబటి రాంబాబు పోలవరం ప్రాజెక్టును పరిశీలించారు. ప్రాజెక్టు పనుల పనుల పరోగతిని సమీక్షించారు.
మంత్రి అంబటి రాంబాబు పోలవరం ప్రాజెక్టును పరిశీలించారు. ప్రాజెక్టు పనుల పనుల పరోగతిని సమీక్షించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. చంద్రబాబు హయాంలో జరిగిన నిర్ణయాలు..తొందరపాటు చర్యల కారణంగానే పోలవరం ప్రాజెక్టుకు నష్టం జరిగిందని మంత్రి రాంబాబు వ్యాఖ్యానించారు. గతేడాది వచ్చిన వరదల కారణంగా డయాఫ్రమ్ వాల్ బాగా దెబ్బతిందని చెప్పారు,డయాఫ్రమ్ వాల్ నిర్మాణ ప్రాంతంలో పెద్దపెద్ద గుంతలు ఏర్పడ్డాయన్నారు. గత వరదల్లో 485 మీటర్ల మేర డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నట్టు నిర్దారించారని మంత్రి వివరించారు.
పూర్తిగా మానవ తప్పిదం వల్లే గతంలో తప్పులు జరిగాయని నిర్దారణ అయిందన్నారు. డయా ఫ్రమ్ వాల్ గ్యాప్‌లో 1,396 మీటర్ల పొడవు కాగా.. వరదల వల్ల డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందని చెప్పారు. పెద్దపెద్ద గుంతలు కూడా ఏర్పడ్డాయని పేర్కొన్నారు. వీటిని సరిచేయకపోతే పనులు ముందుకు సాగవని మంత్రి స్పష్టం చేసారు. దీని కోసం రూ.2 వేల కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారని వెల్లడించారు.

గుంతలు పూడ్చేందుకు 45 లక్షల క్యూసెక్కుల ఇసుక అవసరమని మంత్రి అంబటి రాంబాబు వివరించారు. ఇది వందశాతం చంద్రబాబు తప్పిదమేనని అంబటి రాంబాబు తేల్చి చెప్పారునేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ ద్వారా స్టడీచేశారని.. మూడు రోజుల క్రితమే నివేదిక వచ్చిందని తెలిపారు. ఎవరిపై చర్యలు తీసుకోవాలో త్వరలో నిర్ణయం తీసుకుంటామని అంబటి వివరించారు.
శాస్త్రీయంగా దెబ్బతిన్న భాగాలను రిపేర్ చేసేందుకు అధికారులు డిజైన్ తయారు చేసిన తర్వాత పనులు మొదలవుతాయని చెప్పారు. రానున్న నాలుగైదు నెలల్లో పనులను వేగవంతం చేస్తామన్నారు. సాధ్యమైనంత త్వరగా పనులు చేస్తామని వెల్లడించారు. నాడు వైఎస్సార్ పోలవరం ప్రారంభించారని అంబటి గుర్తు చేసారు. పోలవరం ప్రాజెక్టును సీఎం జగన్ ప్రారంభిస్తామని చెప్పుకొచ్చారు.
2018లోనే ప్రాజెక్టు పూర్తి చేస్తామంటూ నాటి ఇరిగేషన్ మంత్రి అసెంబ్లీలో బల్ల గుద్ది మరీ చెప్పారని గుర్తు చేసారు. ఎందుకు అప్పుడు పూర్తి చేయలేకపోయారో చెప్పాలన్నారు. ప్రభుత్వం ఇప్పుడు ప్రాజెక్టు పనుల పైన నివేదిక తెప్పించుకొని అధ్యయనం చేస్తోంది. నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకొనే అవకాశం కనిపిస్తోంది. ప్రాజెక్టను నాణ్యతతో పూర్తి చేయటానికి ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి వెల్లడించారు.












Click it and Unblock the Notifications