వీడియో వైరల్: అంబటి రాంబాబు ట్రెక్కింగ్ వీడియో చూస్తారా..?
మాజీ మంత్రి అంబటి రాంబాబు ట్రెక్కింగ్ చేస్తూ కొండపైకి ఎక్కారు. అందుకు సంబంధించిన వీడియోను తన అధికారిక యూట్యూబ్ ఛానల్ లో పోస్టు చేశారు. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అంబటి రాంబాబు ఇలా ట్రెక్కింగ్ చేస్తూ కొండపైకి ఎక్కడం చూసిన నెటిజెన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అలా కొండపైకి ఎక్కిన అంబటి రాంబాబు ఓ బండపై సేద తీరారు. ఆ తర్వాత జాతీయ జెండా పట్టుకుని నిల్చున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు ట్రెక్కింగ్ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ ఆయన ట్రెక్కింగ్ చేశారు. కొండ మార్గంలో నడుచుకుంటూ కొండ ఎక్కడం అనేది మంచి అనుభూతి అని తెలిపారు. ఆయన వెంట వైసీపీ నేతలు కూడా ట్రెక్కింగ్ చేశారు. మనసుకు ఏది నచ్చితే అలా చేయాలనేది తన ఉద్దేశం అని అంబటి రాంబాబు అన్నారు. ట్రెక్కింగ్ చేస్తే బాగుంటుంది అనగానే.. ట్రై ఇట్ అన్నాను. ఇప్పుడు విజయవంతంగా కొండ ఎక్కాం అని చెప్పారు. కొద్దిగా కష్టం అనిపించింది. అది సహజం అని తెలిపారు. కొండపైకి ఎక్కి జాతీయ జెండాను ఎగురవేయడం మంచి అనుభూతిని ఇచ్చిందన్నారు.

అంబటి రాంబాబు ట్రెక్కింగ్ చేస్తూ కొండపైకి ఎక్కిన వీడియోను తన అధికారిక యూట్యూబ్ ఛానల్ లో పోస్టు చేశారు. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అంబటి రాంబాబు ఇలా ట్రెక్కింగ్ చేస్తూ కొండపైకి ఎక్కడం చూసిన నెటిజెన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కంగ్రాట్స్ సర్, నమస్తే సర్, హాయ్ సర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అలా కొండపైకి ఎక్కిన అంబటి రాంబాబు ఓ బండపై సేద తీరారు. ఆ తర్వాత జాతీయ జెండా పట్టుకుని ఎగురవేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.












Click it and Unblock the Notifications