OG ఫ్లాప్.. దానయ్య దండగ పడ్డావయ్యా..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం 'ఓజీ' (OG) విడుదల నేపథ్యంలో, రాజకీయాల్లో పవన్ కళ్యాణ్‌కు బద్ధ శత్రువుగా పేరున్న వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. సినిమా రిలీజ్‌కు ముందు 'ఓజీ' హిట్ అవుతుందని గట్టిగా ఆశాభావం వ్యక్తం చేసిన అంబటి, తొలి రోజు టాక్, కలెక్షన్లు అందిన తర్వాత మాటే మార్చేశారు.
'ఓజీ' విడుదల సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ గత చిత్రాలైన 'బ్రో', 'హరిహర వీరమల్లు' అంచనాలను అందుకోలేకపోయాయని గుర్తు చేశారు. అందుకే, ఈసారి పవన్ కసితో పనిచేశారని, అలాగే దర్శకుడు సుజీత్ కూడా సినిమాను హిట్ చేయాలనే పట్టుదలతో ఉన్నారని వ్యాఖ్యానించారు. నిర్మాత దానయ్య ఖర్చుకు వెనకాడలేదని, ఈ ముగ్గురి పట్టుదలతో నిర్మించిన సినిమా తప్పకుండా హిట్ అవుతుందని అంబటి బలంగా నమ్మారు. డిప్యూటీ సీఎంగా ఉన్నా పవన్ తన బాధ్యతలను పక్కనబెట్టి కష్టపడ్డాడని, కాబట్టి 'ఓజీ' విజయవంతం కావాలని తాను కోరుకుంటున్నట్లు ప్రకటించారు. రాజకీయ ప్రత్యర్థి అయినా పవన్ సినిమా సక్సెస్ కావాలన్న ఆయన వ్యాఖ్యలు అప్పట్లో సోషల్ మీడియాలో బాగా ట్రెండయ్యాయి.

అయితే, గురువారం రాత్రి సినిమా విడుదలైన తర్వాత అంబటి రాంబాబు తన తొలి మాటను మార్చేస్తూ ట్వీట్ చేశారు. ప్రత్యర్థి అయినా పవన్ సినిమా ఆడాలని నా ఆరాటమే కానీ ఫలితం మాత్రం శూన్యం. దానయ్యా.. దండగ పడ్డావయ్యా అని ట్వీట్‌లో పేర్కొన్నారు.'దండగ పడ్డావయ్యా' అన్న మాటతో అంబటి రాంబాబు.. 'ఓజీ' చిత్రం ప్రేక్షకులను మెప్పించలేదని, ఫ్లాప్ అయిందని, నిర్మాత దానయ్యకు నష్టాలు తప్పవని తేల్చేశారు. సినిమా హిట్‌పై ఆశలు రేకెత్తించిన అంబటి, ఒక్క ట్వీట్‌తో నిర్మాతకు షాక్ ఇవ్వడం, 'ఓజీ' ఫలితంపై వస్తున్న చర్చలకు మరింత ఆజ్యం పోసినట్లయింది.












Click it and Unblock the Notifications