న్యూడ్ ఫోటోలు తీసి...: నపుంసకత్వాన్ని దాచిపెట్టి భార్యపై టెక్కీ దాష్టీకం

కర్నూలు: ఏపీలోని కర్నూలు జిల్లాలో ఓ సాఫ్టువేర్ ఇంజినీర్ తన భార్య పట్ల శాడిజం చూపించాడు. రాజేంద్రప్రసాద్ అనే టెక్కీ తన నపుంసకత్వాన్ని కప్పిపుచ్చుకునేందుకు పెద్ద డ్రామా ఆడాడు. భార్య నగ్న ఫోటోలు తీసి బ్లాక్ మెయిల్ చేశాడు. తన నపుంసకత్వం గురించి ఎవరికైనా చెబితే ఫోటోలు బయటపెడతానని బెదిరించాడు.

ఆ ఫోటోలను అఢ్డు పెట్టుకొని తనకు విడాకులు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. సదరు నపుంసక భర్త ఆమెకు విడాకులు ఇచ్చి, మరో పెళ్లి చేసుకోవాలని భావించాడు. మరో వివాహానికి కూడా సిద్ధమయ్యాడు. బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు. దీంతో విషయం వెలుగు చూసింది.

పెళ్లైన తొలి రాత్రి అసలు విషయం

పెళ్లైన తొలి రాత్రి అసలు విషయం

పెళ్లయిన తొలి రాత్రే ఆ మహిళకు భర్త గురించి అసలు విషయం తెలిసింది. తాను సంసారానికి పనికి రానని చెప్పాడు. అయితే ఆ తర్వాత ఆమె నగ్న చిత్రాలు తీసి, తన లోపాన్ని బయటకు చెబితే వాటిని సోషల్ మీడియాలో పెడతానని బెదిరింపులకు దిగాడు. చిత్రహింసలు పెట్టాడు.

ఆగస్టులో పెళ్లి

ఆగస్టులో పెళ్లి

అనంతపురం జిల్లా రాయదుర్గానికి చెందిన సాఫ్టువేర్ ఉద్యోగి రాజేంద్రప్రసాద్‌కు గత ఏడాది ఆగస్టులో పెళ్లయింది. ఆ సమయంలో వధువు తల్లిదండ్రులు రూ.45 లక్షల కట్నం ఇచ్చారు. రాజేంద్రప్రసాద్ సంసారానికి పనికి రాడనే విషయం తెలిసి తల్లిదండ్రులు పెళ్లి చేశారని అంటున్నారు.

బయటకు చెప్పుకోలేక

బయటకు చెప్పుకోలేక

విషయం తెలుసుకున్న యువతి, బయటకు చెప్పుకోలేక పోయింది. అత్తమామలకు విషయం చెబితే వారు కూడా బెదిరించారు. తమ కోడలికి టీబీ ఉందని ప్రచారం చేశారు. శారీరకంగా, మానసికంగా హింసించారు. అంతేకాదు, తన కొడుకుకు రెండో పెళ్లి చేసేందుకు సిద్ధపడ్డారు. ఏడాదిపాటు దారుణం భరించిన ఆమె తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేసింది.

టీబీ లేదని నిర్ధారణ

టీబీ లేదని నిర్ధారణ

ఆమెకు టీబీ ఉందని, దానిని దాచి తన కొడుకు జీవితాన్ని నాశనం చేశారని అతని తల్లిదండ్రులు కొత్త నాటకానికి తెరలేపగా.. కర్నూలు అపోలోకి ఆమెను తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించి, టీబీ లేదని రిపోర్ట్‌లు కూడా తీసుకొచ్చారు. అయితే అప్పటికే తమ కొడుకుకు రెండో పెళ్లి చేయాలని నిర్ణయించుకున్న రాజేంద్రప్రసాద్ తల్లిదండ్రులు ఆమె తండ్రి మాటను లెక్కచేయలేదు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+