అమిత్‌ షాకు స్వాగతం పలికిన మంత్రి తానేటి వనిత

విజయవాడ: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల గడువు దగ్గరపడుతోంది. అక్టోబర్/నవంబర్‌లల్లో నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. డిసెంబర్ నాటికి కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావొచ్చు. ఈ ఎన్నికలను ఎదుర్కొనడానికి అన్ని పార్టీలు కసరత్తు సాగిస్తోన్నాయి. అధికార భారత్ రాష్ట్ర సమితి, కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ.. సర్వశక్తులను ఒడ్డుతున్నాయి.

ఎన్నికలను బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఎన్నికల్లో గెలిచి తీరాలనే పట్టుదలతో ఉన్నారు కమలనాథులు. ఇందులో భాగంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా. .తెలంగాణలో పర్యటించనున్నారు. ఖమ్మంలో పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన రైతు గోస-బీజేపీ భరోసా బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.

Amit Shah arrives in Vijayawada he will be attending a public meeting in Khammam of Telangana

ఇందులో పాల్గొనడానికి అమిత్ షా తొలుత విజయవాడకు వచ్చారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరిన కొద్దిసేపటి కిందటే గన్నవరం ఎయిర్ పోర్ట్‌కు చేరుకున్నారు. ప్రొటోకాల్ ప్రకారం.. రాష్ట్ర హోం శాఖ మంత్రి తానేటి వనిత ఆయనకు శాలువా కప్పి ఘన స్వాగతం పలికారు.

ఇక్కడి నుంచి హెలికాప్టర్‌లో అమిత్ షా కొత్తగూడేనికి బయలుదేరి వెళ్తారు. అనంతరం రోడ్డు మార్గంలో ఖమ్మానికి చేరుకుంటారు. సాయంత్రం రైతు గోస-బీజేపీ భరోసా బహిరంగ సభలో పాల్లొంటారు. అనంతరం బీజేపీ కోర్ కమిటీ సమావేశాన్ని నిర్వహిస్తారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై బీజేపీ రాష్ట్రస్థాయి నేతలతో చర్చిస్తారు.

అమిత్ షా తెలంగాణ పర్యటన షెడ్యూల్‌లో చిన్న మార్పు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. తన పర్యటన సందర్భంగా అమిత్ షా భద్రాచలం శ్రీసీతారామాచంద్రస్వామివారి ఆలయాన్ని దర్శించాల్సి ఉంది. సమయాభావం వల్ల ఆలయ సందర్శనను రద్దు చేశారు. ఫలితంగా ఆయన పర్యటన కాస్త ఆలస్యంగా సాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+