తెలంగాణకు ఝలక్: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా అమితాబ్ బచ్చన్...!
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య రంగానికి బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రముఖ బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ వ్యవహరించనున్నారు. బ్రాండ్ అంబాసిడర్‌గా వ్వవహరించడానికి అమితాబ్ అంగీకరించారని మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు.
పాఠకుల కోసం ఫేస్‌బుక్ ద్వారా ఎప్పటికప్పుడు తాజా వార్తలు... లైక్ చేయండి.
వైద్య ఆరోగ్య శాఖ బ్రాండ్ అంబాసిడర్‌గా అమితాబ్ ఉచితంగా సేవలు అందించేందుకు అంగీకరించడంతో మంత్రి కామినేని హర్షం వ్యక్తం చేశారు. అమితాబ్ బచ్చన్ గతంలో గుజరాత్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా గతంలో వ్యవహరించిన విషయం తెలిసిందే.

తెలంగాణ రాష్ట్ర అంబాసిడర్‌గా సానిమా మిర్జాను ఎన్నకోవడంతో ఆంధ్రప్రదేశ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఎవరనే ఊహాగానాలు గతంలో వినిపించిన విషయం తెలిసిందే. ఇటీవల అమితాబ్ బచ్చన్ హైదరాబాద్ వచ్చిన విషయం తెలిసిందే. ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు.
ఆ సమయంలో తాను కొత్తగా ఏర్పడిన తెలంగాణకు సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నానని అమితాబ్ ప్రకటించారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కూడా అమితాబ్ బచ్చన్‌ను తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించాలా అనే విషయమై చర్చించినట్లుగా వార్తలు వచ్చాయి.
వైద్య రంగాన్ని మెరుగుపరుచేందుకు నిపుణుల సూచనలు తీసుకున్నామని, రెండు నెలలకోకసారి నిపుణుల కమిటీ భేటీ అవుతుందని ఆయన తెలిపారు. విమ్స్ అభివృద్ధికి నిధులు కేటాయించామని తెలిపారు. ప్రతి జల్లా కేంద్రంలోనూ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు చేస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications