ఉప్పు అమ్ముకుని బతికాం: ఏపీ ప్యాకేజీపై తొలిసారి పెదవి విప్పిన మోడీ
అమరావతి: రెండు రోజుల క్రితం ఏపీకి కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీపై ప్రధాని నరేంద్రమోడీ స్పందించారు. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించినందుకు ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలిపేందుకు ఢిల్లీకి వెళ్లిన ఏపీ బీజేపీ నేతలు మోడీని కలిశారు. సుమారు గంటకు పైగా ప్రధాని మోడీతో భేటీ అయి ఏపీ తాజా పరిణామాలపై ఆయనకు వివరించారు.
ఈ సందర్భంగా ప్రధాని పలు విషయాలను రాష్ట్ర బీజేపీ నేతలతో చర్చించారు. ఏపీ బీజేపీ నేతలకు మోడీ దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. గుజరాత్ విడిపోయినప్పుడు ఉప్పు అమ్ముకుని బతికామని, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు ఆ పరిస్థితి లేదని ఏపీ బీజేపీ నేతలతో ప్రధాని వ్యాఖ్యానించారు.
అంతేకాదు ఏపీకి కేంద్రం అన్ని విధాలా తన తోడ్పాటును అందిస్తుందని చెప్పారు. ఏపీకి మంచి ప్యాకేజీ ఇచ్చామని, త్వరితగతిన అభివృద్ధి చెందుతుందని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్యాకేజీ ఇచ్చిన మైలేజీని పార్టీ ఎదుగుదలకు ఉపయోగించుకోవాలని మోడీ ఏపీ బీజేపీ నేతలకు సూచించారు.

హోదా కంటే కూడా ప్యాకేజీ అయితే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని నేతలకు సూచించారు. ఇక ఏపీకి ప్యాకేజీని ప్రకటించిన బీజేపీని బలోపేతం చేయాలని అధిష్టానం నిర్ణయించింది. ప్రధాని మోడీతో భేటీ అనంతరం ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస్, బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ కంభంపాటి హరిబాబు మీడియాతో మాట్లాడారు.
కేంద్రం ఇచ్చిన ప్యాకేజీపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఏపీలో త్వరలో బహిరంగ సభలు పెట్టనున్నట్టు తెలిపారు. తొలివిడతలో మూడు సభలు పెట్టాలని పార్టీ నేతలు భావిస్తున్నారు. అయితే ఈ సభలకు ప్రధాని మోడీ హాజరవ్వని, కేంద్ర మంత్రులు, పార్టీ అధ్యక్షుడు అమిత్ షా హాజరవుతారని హరిబాబు తెలిపారు.
ఆర్ధిక ప్యాకేజీ ప్రయోజనాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టాలని దృఢ నిశ్చయంతో ఉన్నామని తెలిపారు. కేంద్రం ఇచ్చిన ప్యాకేజీ వల్ల ఆంధ్రప్రదేశ్‌కు ఏం లాభం జరుగుతుందో ప్రజలకు వివరిస్తామని ఆయన తెలిపారు.
-
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు












Click it and Unblock the Notifications