మళ్లీ ప్రత్యక్షమైన సీఆర్డీయే.. ఏఎంఆర్డీయే మాయం... హైకోర్టు స్టేటస్ కోతో తప్పని మార్పు..
వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీయే రద్దు బిల్లుపై హైకోర్టు స్టేటస్ కో విధించిన సంగతి తెలిసిందే. అయితే అంతకుముందు జూలై 31వ తేదీన గవర్నర్ సీఆర్డీయే రద్దు, వికేంద్రీకరణ బిల్లులకు ఆమోదం తెలిపారు. దీంతో సీఆర్డీయే పేరు మార్పు ప్రక్రియ కొనసాగింది. హైకోర్టులో విచారణ ఉన్నా అధికారులు వినిపించుకోలేదు. కానీ హైకోర్టు మంగళవారం యథాతథస్థితి విధించడంతో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. బిల్లులకు గవర్నర్ ఆమోదంతో చకచకా చేపట్టిన మున్సిపల్ అధికార యంత్రాంగం పనులకు బ్రేక్ పడింది.

ఆదివారం రోజున కూడా..
బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలుపగానే... వీక్ డే.. సెలవు దినం అని అధికారులు కూడా లేదు. విజయవాడలోని సీఆర్డీయే ప్రధాన కార్యాలయంపై ఉన్న బోర్డులను ఆదివారం తొలగించారు. అంటే సీఆర్డీయే పేరును అమరావతి మెట్రోపాలిటన్ రీజన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఏఎంఆర్డీయే)గా మార్చేందుకు తెగ ఉత్సాహం చూపించారు. ప్రభుత్వ వాహనాలపై ఉన్న సీఆర్డీయే స్టిక్కర్లను కూడా తొలగించారు. వాహనాలకు ఏఎంఆర్డీయే స్టిక్కర్లు పెట్టి.. తమ స్వామి భక్తిని చాటుకున్నారు.

సీఆర్డీయేగా మార్పు..
సీఆర్డీయే వెబ్‌సైట్‌ను కూడా ఏఎంఆర్డీయేగా మార్చేశారు. అధికారుల చర్య రాజధాని రైతులు సహా, రాజధాని తరలింపును కాదనే వారికి కాస్త కోపం తెప్పించింది. కానీ హైకోర్టు స్టేటస్ కో తో మళ్లీ తోకముడవాల్సిన పరిస్థితి వచ్చింది. ఏఎంఆర్డీయే వెబ్ సైట్‌ను సీఆర్డీఏగా మర్చేశారు. హైకోర్టు కార్యాలయ తరలింపుపై కూడా స్టేటస్ కో విధించింది. కార్యాలయాలను తరలించొద్దు అని స్పష్టంచేసింది. హైకోర్టు స్టేటస్ కోతో అధికారులు వెబ్ సైట్ పేరు తిరిగి మార్చాల్సి వచ్చింది.
Recommended Video

స్టేటస్ కో విధించడంతో..
మూడు రాజధానుల బిల్లుపై హైకోర్టు ఈ నెల 14 స్టే విధించింది. రాజధాని విభజన పిటిషన్లపై హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. బిల్లులు రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్ల తరపున శ్యామ్ దివాన్, ఉన్నవ మురళీధర్ గట్టిగా వాదించారు. పిటిషన్‌పై 10 రోజుల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణకు 14వ తేదీకి వాయిదా వేసింది. పరిపాలన వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లుకు జూలై 31వ తేదీన గవర్నర్ విశ్వభూషణ్ పరిచందన్ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications