జూ ఎన్టీఆర్, లోకేష్ లో సీఎం అయ్యేదెవరు - తేల్చేసిన జ్యోతిష్కుడు..!!
జూ ఎన్టీఆర్, నారా లోకేష్. నందమూరి - నారా వంశాలకు వారసులు. జూ ఎన్టీఆర్ నాడు టీడీపీలో కీలకంగా వ్యవహరించారు. ఇప్పుడు లోకేష్ పార్టీలో నెంబర్ టూగా ఎదిగారు. కారణాలు ఏవైనా జూ ఎన్టీఆర్ టీడీపీ వ్యవహారాలు..రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నారు.
One point I forgot to mention is that@tarak9999 chart has nice synergy with @PawanKalyan chart. They complement each other's strengths and weaknesses nicely. If they ever team up politically, their combo has very good potential and will be good for people.
— PVR Narasimha Rao (@homam108) June 4, 2023
మంత్రిగా పని చేసిన లోకేష్ ఇప్పుడు తిరిగి తన పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు కష్టపడుతున్నారు. యువగళం పాదయాత్రలో నిమగ్నమయ్యారు . ఇప్పుడు ఈ ఇద్దరి భవిష్యత్ రాజకీయం..సీఎం అయ్యే అవకాశం పైన ఒక ప్రముఖ జ్యోతిష్కుడు అంచనాలు వైరల్ అవుతున్నాయి.

ఇద్దరి గురించి ఇలా:జ్యోతిష్కుడు పీవీఆర్ నర్సింహారావు ఈ అంచనాలను సోషల్ మీడియాలో పోస్టు చేసారు. ఐఐటియన్, వేదిక్ ఆస్ట్రాలజర్ గా ఉన్నారు. ఈయన వ్యక్తం చేసిన అంచనాల్లో జూ ఎన్టీఆర్- నారా లోకేష్ జాతకం.. వారి భవిష్యత్ గురించి వివరించారు. తారక్, లోకేష్ సన్నిహితుల నుంచి వారి పుట్టిన రోజు డేటాను సేకరించినట్లు వెల్లడించారు.
గతంలో స్వీకరించిన జన్మకాలాలతో తాను సంతృప్తి చెందలేదని..తరువాత స్పష్టమైన సమాచారం వచ్చిందని వివరించారు. లోకేష్ పైన తన అభిప్రాయాలను స్పష్టం చేసారు. లోకేష్ చాలా తెలివైన వ్యక్తి అని..కానీ, బహిరంగంగా మాత్రం కాదని పేర్కొన్నారు. లోకేష్ కు ఇగే ఉందని, అదే పెద్ద శత్రువుగా అభివర్ణించారు. లోకేష్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్, సాఫ్ట్ స్కిల్స్ లో చాలా పేలవంగా ఉన్నారని విశ్లేషించారు.
సీఎం అయ్యే అవకాశం:వచ్చే పదేళ్ల కాలంలో లోకేష్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు కనిపించటం లేదన్నారు. జూ ఎన్టీఆర్ తో లోకేష్ కలిసి ఉండరని..వారి జాతక లగ్నాలు సింహ & మకర కారణంగా విభేదిస్తారని పేర్కొన్నారు. ఒక జూనియర్ ఎన్టీఆర్ ను చాలా తెలివైన, ప్రపంచ జ్ఞానిగా విశ్లేషించారు. మేధస్సు , అద్భుతమైన నాయకత్వ లక్షణాలతో ఉంటారని పేర్కొన్నారు. అహం కూడా అతనికి అడ్డంకిగా ఉంటుందని..,
కానీ దానిని ఎలా నియంత్రించాలో అతనికి తెలుసని వివరించారు. అలాగే, రాబోయే సంవత్సరాల్లో అతను రాజకీయ అవగాహనను పెంచుకుంటాడని పేర్కొన్నారు. రాబోయే దశాబ్దంలో జనంలో అతని ప్రజాదరణ పెరుగుతూనే ఉంటుందని వివరించారు. తన తాన ఎన్టీఆర్ తరహాలో రాజకీయ విజయానికి దగ్గరవుతారని అంచనాగా వెల్లడించారు.
తారక్ - పవన్ కాంబోపై:రానున్న 15 ఏళ్ల కాలంలో జూ ఎన్టీఆర్ ఖచ్చితంగా రాజకీయ విజయం..అధికారం దక్కించుకుంటారంటూ నర్సింహారావు ఆసక్తికర విశ్లేషణ చేసారు. ప్రస్తుత ఎన్నికల్లో మాత్రం సాధ్యం కాదన్నారు. ఇంకా సమయం పడుతుందని వివరించారు. దీంతో పాటుగా జూ ఎన్టీఆర్, పవన్ కల్యాణ్ మధ్య చక్కటి సమన్వయం ఉంటుందని పేర్కొన్నారు.
ఇద్దరూ రాజకీయంగా జత కడితే ఆ ఇద్దరి కాంబో మంచి సామర్ధ్యంతో ఉంటుందని, ప్రజలకు మేలు చేస్తుందని ఆస్ట్రాలజర్ పీవీఆర్ నర్సింహారావు వెల్లడించారు. తన సోషల్ మీడియా ఖాతాలో ఆయన ఈ విషయాలను వివరించారు. ఇప్పుడు ఏపీలో రాజకీయంగా పొత్తులు..ఎన్నికల పైన అంచనాలు పెరుగుతున్న వేళ ఈ జ్యోతిష్య విశ్లేషణ వైరల్ అవుతోంది.
-
ఇంటింటికీ గంగమ్మ: డ్వాక్రా మహిళలకు కీలక బాధ్యతలు -
పవన్ "ఉస్తాద్" మూవీకి థియేటర్ మెయింటెనెన్స్ ఖర్చులు కూడా వచ్చేలా లేవా ??? -
రాజకీయ దురంధురుడు చంద్రబాబు: స్టీల్ ప్లాంట్ భూమిపూజలో పవన్ కళ్యాణ్ కితాబు! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
గుండెపై "నాగబాబు" పేరు టాటూగా వేసుకున్న టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్ !! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications