చీమకుర్తి సభలో ఇంట్రస్టింగ్ సీన్ - "అమ్మ" చేసిన పనికి జగన్ వెంటనే : గుర్తిండిపోయేలా...!!
చీమకుర్తి సభలో ఆససక్తి కర సన్నివేశం చోటు చేసుకుంది. చీమకుర్తి పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి జగన్ వైఎస్సార్.. బూచేపల్లి సుబ్బారెడ్డి కాంస్య విగ్రహాలను ఆవిష్కరించారు. ఆ తరువాత బహిరంగ సభలో పాల్గొన్నారు. బూచేపల్లి కుటుంబానికి .. వైఎస్సార్ ఫ్యామిలీకి దగ్గరి సంబంధాలు ఉన్నాయ. సీఎం పాల్గొన్న సభలో జడ్పీ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ జిల్లా గురించి మాట్లాడారు. వైఎస్సార్ చేసిన పథకాల గురించి వివరించారు. సీఎం జగన్ పాలనను ప్రశంసించారు.
జిల్లా పరిషత్ ఛైర్మన్ గా జిల్లాకు సంబందించిన అంశాలకు నిధులు మంజూరు చేయాలని కోరారు. అదే సమయంలో ఒక పాట అందుకున్నారు. వైఎస్సార్ - జగన్ ను ప్రశంసిస్తూ పాట మొదలు పెట్టారు. ఆ సమయంలో మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి వారించే ప్రయత్నం చేసారు. కానీ, వెంకాయమ్మ వినలేదు. దీంతో.. సీఎం జగన్ తన సీటులో నుంచి లేచి వెళ్లి.. వెంకాయమ్మ వద్ద ఉన్న చనువుతో భుజం పట్టుకొని తీసుకొచ్చి తన పక్కన కుర్చీలో కూర్చోబెట్టారు. ఇప్పుడు ఈ సీన్ వైరల్ అవుతోంది. సీఎం తన ప్రసంగంలోనూ మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద రెడ్డిని తన సోదరుడిగా.. వెంకాయమ్మ ను అమ్మగా అభివర్ణించారు.

వెంకాయమ్మ కోరిన విధంగా జెడ్పీ హాల్ నిర్మాణానికి నిధులు.. రిజర్వాయర్ కు సుబ్బారెడ్డి పేరు ఖరారు చేసారు. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బూచేపల్లి సుబ్బారెడ్డి క్రియాశీలకంగా ఉన్నారు. జగన్ ముఖ్యమంత్రి కావాలని ఆయన ఆశించారని. అయితే..అది చూడకుండానే సుబ్బారెడ్డి కన్నుమూశారంటూ సభలో ఒక వీడియో ప్రదర్శించారు.

చీమకుర్తిలో సీఎం వైయస్ జగన్ పర్యటన.
— YSR Congress Party (@YSRCParty) August 24, 2022
దివంగత సీఎం వైయస్ఆర్, దివంగత మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి కాంస్య విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమం.
Watch Live: https://t.co/rLKuBJ9Vh3 #YSJaganInauguratesYSRStatue #JoharYSR
దర్శి నుంచి గత ఎన్నికల్లో పోటీకి బూచేపల్లి కుటుంబం దూరంగా ఉంది. వచ్చే ఎన్నికల్లో శివప్రసాద రెడ్డి తిరిగి పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే సభలో సీఎం జగన్ తాను 2023 సెప్టెంబర్ లో వెలిగొండ ప్రాజెక్టు ను జాతికి అంకితం చేసిన తరువాతనే ఎన్నికలకు వెళ్తామంటూ ప్రకటించారు. ఇక, వెంకాయమ్మ పాట.. జగన్ చొరవ వీడియో మాత్రం ఇప్పుడు వైసీపీ సర్కిల్స్ లో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది.












Click it and Unblock the Notifications