తప్పించుకునేందుకే బాబు ఫోన్ ట్యాపింగ్, బాలయ్యకు సీఎం అయ్యే అర్హతలు: ఆనం
హైదరాబాద్: ఏపీ సీఎంగా చంద్రబాబు స్థానంలో సీఎం అయ్యేందుకు నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు అర్హతలు ఉన్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత ఆనం రామనారాయణరెడ్డి వ్యాఖ్యానించారు. ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబు అడ్డంగా దొరికారని ఆయన అన్నారు.

సోమవారం విలేకరులతో ఆయన మాట్లాడారు. వెంటనే సీఎం పదవికి రాజీనామా చేసి విచారణకు సిద్ధమవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబు ఆదేశిస్తేనే, రేవంత్ రెడ్డి మధ్యవర్తిత్వం మాత్రమే చేశాడని ఆనం పేర్కొన్నారు. చంద్రబాబు చేసిన తప్పు ఒప్పు కోవడం ఇష్టం లేకనే ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని వెలుగులోకి తెచ్చారని విమర్శించారు.
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఎన్టీఆర్ అభిమానులు మాత్రం తమకు చంద్రబాబు దారిద్ర్యం పోతుందని బాలయ్య సీఎం అవుతారని భావిస్తున్నారని అన్నారు. ఓటుకు నోటు వ్వవహారంలో బీజేపీ రెండు నాల్కల ధోరణిని వ్యవహరిస్తోందని ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications