'జగన్ కు పిచ్చిపట్టింది కాబట్టే ఇలా.. శవాలను పీక్కుతినే రాబందులా!!'
నెల్లూరు : వైసీపీ అధినేత జగన్ ను టార్గెట్ చేస్తూ.. పదునైన వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు టీడీపీ నేత ఆనం వివేకానందరెడ్డి. ఓ పక్క రాయలసీమ రైతులను ఆదుకునేందుకు సీఎం చంద్రబాబు కృషి చేస్తుంటే.. ఓర్వలేని తనంతో జగన్ ధర్నాలు బంద్ లకు పిలుపునిస్తుండడం సిగ్గుచేటు అని విమర్శించారు.
'పిచ్చిపట్టినట్లు ప్రవర్తిస్తూ.. పదే పదే ప్రభుత్వ పనితీరును విమర్శించడమే జగన్ పనిగా పెట్టుకున్నారని' మండిపడ్డారు వివేకా. ప్రస్తుతం వైసీపీ పరిస్థితి సమాధి అయిపోయే స్థితిలో ఉందన్న ఆనం.. అందుకోసం జగన్ అంతిమపోరాటం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. జగన్ అక్రమంగా సంపాదించిన లక్ష కోట్ల రూపాయల్లో.. కొంత మొత్తాన్నయినా వానలు పడేందుకు ఖర్చు చేయాలని జగన్ కు హితవు పలికారు.

నారా లోకేషన్ ను విమర్శించడాన్ని తప్పుబడుతూ.. అవినీతి ఊబిలో చిక్కుకుపోయిన జగన్ లాంటి వ్యక్తి లోకేష్ ను విమర్శించడమేంటని ప్రశ్నించారు ఆనం. మానవ మృగంలా ప్రవర్తిస్తున్న జగన్.. 'శవాలను సైతం పీక్కుతినే రాబందులా వ్యవహరిస్తున్నాడని' ఆనం తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకుని రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని సూచించారు.
ఇక సీఎం చంద్రబాబు నాయుడును పొగడ్తల్లో ముంచెత్తిన ఆనం.. నదిలో కొట్టుకుపోతున్న నావను రక్షించడానికి నావికుడు చేసే ప్రయత్నం తరహాలో చంద్రబాబు నాయుడు సైతం రాష్ట్ర ప్రగతి కోసం శక్తి వంచన లేకుండా నిరంతరం శ్రమిస్తున్నారన్నారు. భవిష్యత్ తరాల కోసం ఆయన సాగిస్తోన్న పోరాటానికి ప్రజలంతా మద్దతుగా ఉండాలని పిలుపునిచ్చారు.
-
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్!












Click it and Unblock the Notifications